గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

దివ్యాంగుడి కోసం మహిళ చేసిన పనికి నెటిజన్లు ఫిదా


తిరువనంతపురం: గజిబిజి పరుగుల జీవితంలో మన కోసం మనం కేటాయించే సమయమే చాలా తక్కువ అనేది కాదనలేని సత్యం. ఇక పక్కవారి గురించి మనం ఎక్కడ ఆలోచిస్తాం? కానీ కేరళకు చెందిన ఓ మహిళ మాత్రం మానవత్వం, సాటి వారిని పట్టించుకునే తత్వం ఇంకా ఉన్నాయని నిరూపించారు. బస్సు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్న ఓ దివ్యాంగుడి కోసం ఆ మహిళ చేసిన సాయం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

రోడ్డుపై వెళుతున్న బస్సును ఆపాలంటూ ఓ మహిళ పరిగెత్తడం గమనించిన కండక్టర్‌ బస్సును ఆపాడు. తీరా బస్సు వద్దకి చేరుకున్న మహిళ కండక్టర్‌తో ఏదో చెప్పి మళ్లీ వెనక్కి వెళ్లింది. అప్పటికే మెల్లగా నడుచుకుంటూ వస్తున్న అంధుడైన వృద్ధుడి చేయి పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి జాగ్రత్తగా బస్సు ఎక్కించించింది. ఆపై ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరిచయంలేని వ్యక్తి పట్ల ఆమె ప్రదర్శించిన ఔదార్యానికి బస్సులో వారు సహా అక్కడున్న వారు ఆమె చేసిన పనిని ప్రశంసించారు. 

ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. విజయ్‌కుమార్‌ అనే ఐపీఎస్‌ అధికారి ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె చేసిన పనికి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మానవత్వం, దయాగుణం ఇంకా బతికే ఉన్నాయని ఆమె నిరూపించారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని