గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనా తగ్గలేదో.. మంత్రివర్గం రద్దే!

హెచ్చరించిన కజఖ్‌‌స్థాన్‌ అధ్యక్షుడు టొకయేవ్‌

ముంబయి: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కజఖ్‌‌స్థాన్‌ అధ్యక్షుడు కస్యైమ్‌ జొమార్ట్‌ టొకయేవ్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌-19 నుంచి విముక్తి పొందేందుకు రెండోసారి అమలు చేయబోతున్న రెండువారాల లాక్‌డౌన్‌ విఫలమైతే మంత్రివర్గాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హెచ్చరించారు.

‘రెండో లాక్‌డౌన్‌ ముగిశాక మెరుగుదల లేకపోతే ప్రభుత్వ సామర్థ్యం, మంత్రివర్గ కూర్పుపై సందేహాలు తలెత్తుతాయి’ అని అధ్యక్షుడు టొకయేవ్‌ అన్నారు. ప్రస్తుతం కజఖ్‌‌స్థాన్‌లో 55,000 కేసులు ఉన్నాయి. 264 మంది మృతిచెందారు. గురువారం రోజు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జులై 5 నుంచి అక్కడ రెండో విడత లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.

మొదటి లాక్‌డౌన్‌ వల్ల కజఖ్‌‌స్థాన్‌ ఆర్థిక వ్యవస్థ 1.8శాతం తగ్గింది. సేవల రంగం డీలాపడింది. చమురు, గ్యాస్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో తీవ్ర నష్టాలు తలెత్తాయి. అందుకే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మంత్రివర్గాన్ని టొకయేవ్‌ ఆదేశించారు. కొవిడ్-19పై పోరాడేందుకు 150 బిలియన్‌ టెంజ్‌లు (363 మిలియన్‌ డాలర్లు) అదనంగా కేటాయిస్తున్నానని వెల్లడించారు. ద్రవ్యోల్బణం లక్షిత రేటును 8.0-8.5% నుంచి 9.0-11.0 శాతానికి సవరించాలని కేంద్ర బ్యాంకును కోరారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని