గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

HCQతో ఎంత బాగున్నానో చూశారు కదా!

బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారో

ముంబయి: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో మరోసారి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రతి రోజూ ఒకటి చొప్పున తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు తనకెంతో తేలిగ్గా ఉందని, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానని అన్నారు.

కొవిడ్‌-19 సోకినప్పటికీ బొల్సొనారో ఎప్పటిలాగే తన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తన అధికారిక నివాసం నుంచి గురువారం సాయంత్రం ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ఆయనతో పాటు మంత్రులు, సీనియర్‌ అధికారులు, భాషా అనువాదకులు ఉండటం గమనార్హం. ముందు నుంచీ ఆయన ‌మహమ్మారిని తేలిగ్గా తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కట్టడి చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాల గవర్నర్లనూ ఆయన వ్యతిరేకించడం గమనార్హం.

కరోనా వైరస్‌తో గతవారం‌ ఇబ్బందిగా అనిపించింని బొల్సొనారో అన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడటం మొదలుపెట్టాక ఉపశమనం లభించింన్నారు. ప్రతి రోజూ ఒక మాత్ర చొప్పున తీసుకుంటున్నానని తెలిపారు. ఇప్పుడు తానెంత సులభంగా మాట్లాడుతున్నానో చూడాలని కోరారు. హెచ్‌సీక్యూను విమర్శిస్తున్న వారు ప్రత్యామ్నాయం చూపించాలని సవాల్‌ విసిరారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని