శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనా దెబ్బతో అత్యల్ప వృద్ధిరేటు తప్పదు

ముంబయి: సంస్కరణలు ప్రవేశపెట్టాక 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యల్ప వృద్ధిరేటు నమోదు చేయనుందని సీనియర్‌ ఆర్థికవేత్త ఒకరు అంచనా వేస్తున్నారు. ఆరు నెలలుగా మందగమన దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ పెను ప్రభావం చూపిస్తోందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పబ్లిక్‌ ఫైనాన్స్‌, పాలసీ ప్రొఫెసర్‌ ఎన్‌ఆర్ భానుమూర్తి అన్నారు. చైనాలో మొదట వెలుగు చూసిన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.

‘ఆరు నెలలుగా భారత ఆర్థిక వ్యవస్థ మందనగమనం దశలో ఉంది. పరిస్థితిని ఇప్పుడీ లాక్‌డౌన్‌ మరింత దిగజార్చనుంది. త్రైమాసిక కాలంలో పరిస్థితి మెరుగవుతుందనుకుంటున్నా. అయితే 2020-21లో సంస్కరణలు చేపట్టిన తర్వాత (1991) తొలిసారి అత్యల్ప వృద్ధిరేటు నమోదు కానుంది. ఫిబ్రవరి 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం కఠిన ద్రవ్య, ఆర్థిక ఉద్దీపనలు, చర్యలు తీసుకున్నప్పటికీ వృద్ధిరేటు తగ్గనుంది’ అని భానుమూర్తి అన్నారు.

కొవిడ్‌-19 వల్ల 2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు 4 శాతం తగ్గుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. 2020 ఏడాదికి భారత జీడీపీ వృద్ధిరేటుకు మూడీస్‌ 2.5 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊహించని షాక్‌ తగిలిందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ 2024-25లోపు ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందా? అని భానుమూర్తిని ప్రశ్నించగా వృద్ధిరేటు బాగున్నప్పుడే అది కష్టమని వెల్లడించారు.

‘ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యం దశకు చేరుకుంటుందని అంచనా. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సదూర స్వప్నమే. దానికి తోడు మారకం విలువ తగ్గుతోంది’ అని భానుమూర్తి అన్నారు. 15వ ఆర్థిక సంఘాన్ని అధ్యయనాల ఆధారంగా తెలివైన ఆర్థిక విధానాలు అమలు చేస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయంగా అది కుదరకపోవచ్చన్నారు. ప్రస్తుత రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపనలకు తోడుగా మరెన్నో చేయాల్సి ఉంటుందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 2020-21 ఆర్థిక ఏడాదికి 6 - 6.5%గా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసిన సంగతి తెలిసిందే.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)