గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

భార‌త్‌: ఒక్క‌రోజే 26,506 కేసులు!

8 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు
21,604కు చేరిన‌ కొవిడ్ మ‌ర‌ణాలు

దిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. గ‌త వారంరోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క‌రోజే అత్య‌ధికంగా 26,506 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డ్డ అనంత‌రం రోజూవారీ సంఖ్య‌లో ఇదే గ‌రిష్ఠం. దీంతో శుక్ర‌వారం నాటికి దేశంలో క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య 7,93,802కు చేరింది. అంతేకాకుండా గ‌డిచిన 24గంటల్లో మ‌రో 475 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌రకు 21,604మంది కొవిడ్ బాధితులు మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  గ‌త వారంరోజులుగా దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌ స‌రాస‌రి 480గా ఉంది. ఇక భార‌త్‌లో క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌రకు 4,95,513 మంది కోలుకోగా మ‌రో 2,76,685 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ దేశంలో సామాజిక వ్యాప్తి లేద‌ని ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

పెరుగుతున్న రిక‌వ‌రీ రేటు..

భార‌త్‌లో భారీ సంఖ్య‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ కోలుకుంటున్న వారిసంఖ్య అదేస్థాయిలో పెరుగుతోంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ప్రస్తుతం క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 62.09శాతంగా ఉంద‌ని వెల్ల‌డించింది. మే 31న దేశంలో 47శాతంగా ఉన్న‌ క‌రోనా రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 62.09శాతానికి పెరిగింద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాకుండా ప్ర‌తి ప‌దిల‌క్ష‌ల జ‌నాభాకు క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భార‌త్‌లోనే తక్కువ‌గా ఉన్న‌ట్లు అభిప్రాయ‌ప‌డింది.

ఇవీ చ‌ద‌వండి..
ఇప్పుడ‌ప్పుడే ముగిసేది కాదిది... మోదీ
మ‌నోధైర్య‌మే మందు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని