సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అమెరికాలోని 40 నగరాల్లో కర్ఫ్యూ!

కొనసాగుతున్న నిరసనలు..!

వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో అమెరికాలో కొనసాగుతున్న నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. అమెరికాలో నల్లజాతీయులపై దాడులకు నిరసనగా దేశంలో జరుగుతోన్న ఆందోళనలు పలు రాష్ట్రాల్లో ఉద్ధృతమయ్యాయి. నిరసనకారులు ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌‌ బయటే భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. దీంతో అధ్యక్షుడు కొద్దిసేపు రహస్య బంకర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూ విధించారు. ముఖ్యంగా వాషింగ్టన్‌ డీసీతో పాటు మరో నలభై నగరాల్లో కర్ఫ్యూ విధించినట్లు ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెల్లడించారు.

‘ఆందోళన తీవ్రత ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాల్లో ఇప్పటికే 5వేల మంది జాతీయ భద్రతా దళాలను రంగంలోకి దించాం. అవసరమైతే మరిన్ని ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని నేషనల్‌ గార్డ్‌ బ్యూరో చీఫ్‌ జనరల్‌ జోసెఫ్‌ లెంగ్యల్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా పోలీసు వ్యవస్థలోనే జాత్యాహంకార భావన ఉందని వస్తోన్న ఆరోపణలను అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి భావనను సృష్టిస్తున్నారని అన్నారు.మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని