గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మహారాష్ట్రలో తగ్గని కరోనా బీభత్సం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 6,875 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 219 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,30,599కి చేరగా.. మరణాల సంఖ్య 9,667కి పెరిగిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే 4,067 మంది బాధితులు డిశ్చార్జి అయినట్లు తెలిపింది. రికవరీ రేటు 55.19 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

* మరోవైపు తమిళనాడులో సైతం భారీగా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 4,231 కేసులు వెలుగుచూశాయి. 65 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,26,581కి పెరిగింది. మరణాల సంఖ్య 1,765గా నమోదైంది.

* కర్ణాటకలో కొత్తగా 2,228 కేసులు వెలుగుచూశాయి. 17 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 31,105కి, మరణాల సంఖ్య 486కి చేరింది.

* దేశంలో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కేరళలో ఇవాళ కొత్తగా 339 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,534కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,795 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.

దేశ రాజధాని దిల్లీలో 2,187 కేసులు, 45 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 1,07,051కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 3,258కి పెరిగింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని