గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నేపాల్‌: కొండ‌చరియ‌లు విరిగిప‌డి 44మంది గ‌ల్లంతు!

కాఠ్‌మాండూ: నేపాల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి క‌స్కీ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొండ‌చరియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో ఇప్ప‌టికే 12మంది మృతిచెందగా మ‌రో 19మంది వాటిలో చిక్కుకుపోయిన‌ట్లు అక్క‌డి పోలీసులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున కురిసిన భారీ వ‌ర్షాల‌కు కొండచరియ‌లు విరిగి నివాస స్థ‌లాల‌పై ప‌డ‌డంతో చాలా ఇళ్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో చాలామంది వాటికింద‌  చిక్కుకుపోయిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌రకు 44మంది గ‌ల్లంతైన‌ట్లు గుర్తించామ‌ని, ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. శిథిలాల మ‌ధ్య గాలింపు చ‌ర్య‌లను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా పొఖారా ప‌ట్ట‌ణానికి స‌మీపంలోని సారంగ్‌కోట్‌, హేమ్‌జాన్ ప్రాంతాల్లో ఎక్కువ‌గా కొండ‌చరియ‌లు విరిగి ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండ‌చరియ‌లు విరిగిప‌డిన‌ ఘ‌ట‌న‌ల్లో మ‌రో 12మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అన్ని ప్రాంతాల్లోనూ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని