☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 25/01/2021 06:50 IST
దుస్తుల మీద నుంచి తాకితే.. లైంగిక వేధింపులు కాదు

నేరుగా స్పృశిస్తేనే అలా పరిగణించాలని ‘పోక్సో’ చట్టం చెబుతోంది
బాంబే హైకోర్టు స్పష్టీకరణ
నిందితుడికి దిగువ కోర్టు విధించిన శిక్ష రద్దు

ముంబయి: లైంగిక వేధింపులకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చను రేకెత్తిస్తోంది. ‘పోక్సో’ చట్టం(లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని వ్యాఖ్యానించింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారణ సందర్భంగా.. నాగ్‌పుర్‌ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పునిచ్చింది. ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8(చిన్నారులపై లైంగిక దాడి) కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అయితే నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 354(ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్‌ 342(దురుద్దేశంతో నిర్బంధించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించింది.

కేసు పూర్వాపరాలివీ..
2016లో సతీష్‌ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పడానికి యత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ పైన పేర్కొన్న శిక్షలు విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువరించింది. ‘‘పోక్సో చట్టం ప్రకారం విధించే కఠిన శిక్షల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిందితుల నేరాన్ని నిరూపించడానికి గట్టి సాక్ష్యాలు, వారిపై తీవ్రమైన ఆరోపణలు ఉండాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. ఈ కేసులో నిందితుడు బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టాడా అన్న నిర్దిష్టమైన వివరాలు లేవు. కాబట్టి దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేం’’ అని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

మరిన్ని

  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!పులి, చిరుత.. అని చెవినపడితేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ అకస్మాత్తుగా ఓ చిరుత ఎదురుపడితే ప్రాణాలు గాల్లో కలిసినంత పనవుతుంది. అలాంటిది పిడుగులా మీదపడ్డ చిరుతతో భీకరంగా పోరాడి పైచేయి సాధించాడు
  • కరవుదీరా ఎరువురామగుండానికి పూర్వ వైభవం వచ్చింది.. ఇక్కడి ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో ఆదివారం ప్రయోగాత్మకంగా యూరియా ఉత్పత్తి చేపట్టారు. ఇందుకోసం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవో నిర్లిప్‌సింగ్‌ రాయ్‌ మూడు రోజులుగా మకాం వేశారు.
  • రాయితీలకు సున్నంసామాన్యుల నుంచి సంపన్నులవరకూ అందరికీ ప్రయాణ వనరుగా రైల్వేకు పేరుంది. ఆ గుర్తింపునకు తగ్గట్టే వివిధ వర్గాలను గౌరవించడంలో కూడా ముందుండేది. కరోనా ఆ పేరును తుడిచేసింది.
  • ఈ ఏడాది ఒక డిగ్రీ ఎక్కువేఅప్పుడే రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులతో రాష్ట్రం వేడెక్కుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
  • కృష్ణపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చిద్దాం.. రండినెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కొత్తగా సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు (గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌) అంశంపై చర్చించేందుకు దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉన్న పోస్కో ప్రధాన కార్యాలయం నుంచి
  • కొత్తగా 176 కొవిడ్‌ కేసులు; ఒకరి మృతిరాష్ట్రంలో కొత్తగా 176 కొవిడ్‌ కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 2,98,807కు పెరిగింది. మహమ్మారితో మరొకరు కన్నుమూయగా ఇప్పటివరకూ 1,634 మంది మృతి చెందారు.
  • మళ్లీ ముప్పు.. వద్దే వద్దురాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై మార్చి 2(మంగళవారం)తో ఏడాది అవుతుంది. ఈ సంవత్సర కాలంలో కొవిడ్‌ అనేక పాఠాలు నేర్పింది. ఎన్నడూ ఎరుగని కొత్త అలవాట్లను సాధారణ జీవనంలో కచ్చితంగా ఆచరించేలా చేసింది.
  • భక్తులెవరూ మేడారం రావద్దు!మేడారం ఆలయ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకిన నేపథ్యంలో 21 రోజులపాటు వన దేవతల దర్శనాలు నిలిపివేశారు. అప్పటివరకు భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల చెంతకు రావద్దని
  • ద్రవరూప యూరియాయూరియా తయారీ, వినియోగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశంలో సాగులో అత్యధికంగా వినియోగిస్తున్న ఈ రసాయన ఎరువును సూక్ష్మ(నానో) పరిమాణంలో ద్రవరూపంలో అమ్మకానికి అనుమతించింది.
  • గొల్లగట్టుకు పెద్ద పండగఒలింగా.. ఓ..లింగా నామస్మరణ, వీరనాలు, కటారులు, భేరీల విన్యాసాలతో సూర్యాపేట సమీపంలోని పెద్దగట్టు (గొల్లగట్టు) ఆదివారం అర్ధరాత్రి దద్దరిల్లింది.మేడారం తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదిగా,
  • ఐటీఐఆర్‌ ఇవ్వండి..ఐటీ పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న తెలంగాణను ప్రోత్సహించేందుకు ఐటీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌)ను మంజూరు చేయాలని.. దానిని ప్రారంభించని పక్షంలో అదే స్థాయి, హోదా గల మరో ప్రాజెక్టునైనా మంజూరు చేయాలని
  • అంతరిక్షంలో అవకాశాలు అనంతంఅమెరికాలోని ఏరోస్పేస్‌ తయారీ, అంతరిక్షయాన సేవల కంపెనీ ‘స్పేస్‌ఎక్స్‌’ తరహాలో మనదేశంలోనూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు కీలకపాత్ర పోషించే రోజు ఎంతో దూరంలో లేదని హైదరాబాద్‌కు చెందిన అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు అన్నారు.
  • ఇస్రో విజయగీతంభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోమారు చరిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైంది. 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.
  • నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకారాష్ట్రంలో సోమవారం నుంచి సుమారు 50 లక్షల మందికి కరోనా టీకా వేయనున్నారు. 60 ఏళ్లు పైబడినవారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలిరోజు పరిమిత కేంద్రాల్లో మాత్రమే టీకాలు వేస్తారు.
  • అంతే లేని సొరంగం కథఅప్పటి మాటలు అలా ఉన్నా వాస్తవంలో  శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల పురోగతి మరీ దయనీయంగా ఉంది. ఒప్పందం ప్రకారం 2009 నాటికి పూర్తి కావాల్సిఉన్నా ఇప్పటికీ కాలేదు. ఎప్పటికవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియదు.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
  • రేపటి సిరులు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.