ఆదివారం, ఏప్రిల్ 05, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

పారాసిటమాల్‌తో ఏమార్చారు!

ఇండోనేసియా వాసుల ఎత్తుగడ
బయలుదేరే ముందే వారికి కరోనా
విచారణలో వెలుగులోకి
వారి కారణంగా 500 మందికి క్వారంటైన్‌
ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఇండోనేసియా నుంచి 17 రోజుల కిందట కరీంనగర్‌కు వచ్చిన పదిమంది విదేశీయులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నారు. వారందరికీ కరోనా పాజిటివ్‌ అని తేలడంతో పాటు వారితో తిరిగిన మరో వ్యక్తి కూడా కరోనా బారిన పడ్డాడు. వీరు కలిసినందుకు తెలంగాణలోని దాదాపు 500 మందిలో కొందరిని హోం క్వారంటైన్‌ చేయగా, మరికొందరిని ఆస్పత్రులకు పంపించారు. ఈనెల 9న ఇండోనేసియా నుంచి పదిమంది దిల్లీలో దిగారు. అప్పటికే వారిలో కొందరు తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. విమానాశ్రయంలో పట్టుబడితే ఆస్పత్రిలో చేరుస్తారన్న ఉద్దేశంతో విమానం దిగడానికి ముందు, దిగాక కూడా నాలుగైదు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకున్నారని పోలీసు విచారణలో వెల్లడైంది. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా వారంతా యథేచ్ఛగా దిల్లీలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు. 13వ తేదీన సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి 14న రామగుండంలో దిగారు. అక్కడి మత పెద్దలతో మాట్లాడి ప్రైవేటు వాహనంలో కరీంనగర్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఒకరికి దగ్గు బాగా రావడంతో పరీక్షించగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. మిగతావారిని కూడా పరీక్షించగా కరోనా వైరస్‌ ఉందని తేలింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇండోనేసియావాసులతో ఇద్దరు గైడ్లు సహా ఎస్‌9 బోగీలో 82 మంది ప్రయాణించారని తేలింది. వారిలో కొందరు గద్వాల, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాల్లో దిగినట్లు వెల్లడైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీన్ని తీవ్రంగా పరిగణించడంతో రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారాయణ, కరీంనగర్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి దీనిపై దృష్టి సారించారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు 300 మందిని హోం క్వారంటైన్‌ చేయగా.. 130 మందిని ప్రత్యేక వార్డులకు తరలించారు. ఆ విదేశీయులు ప్రయాణించిన బోగీలో ప్రయాణించిన ఇద్దరు కానిస్టేబుళ్లనూ క్వారంటైన్‌లో ఉంచారు. ప్రైవేటు వాహనం డ్రైవర్‌ క్వారంటైన్‌లో ఉండటానికి నిరాకరించడంతో అతనిపై కేసులు నమోదు చేసి.. క్వారంటైన్‌కు పంపించారు. ఆ రైలులో ప్రయాణించినవారిని, వారివెంట తిరిగినవారిని వెతికిపట్టుకుని వారిపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో వెయ్యిమంది పోలీసులు పనిచేయాల్సి వచ్చింది. బాధితుల 14 రోజుల క్వారంటైన్‌ ఈనెల 28తో ముగుస్తుంది. అప్పటివరకు వీరిలో ఎవరికీ వైరస్‌ లేదని తేలిపోతే ఇబ్బంది లేనట్లేనని రామగుండం కమిషనర్‌ సత్యనారాయణ ‘ఈనాడు’కు తెలిపారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)