సందేహం

Published : 08/07/2021 01:21 IST
దృష్టినిబట్టే సృష్టి

క్రీస్తువాణి

ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులుండేవారు. వారిలో ఒకరిది మంచి మనసు. మరొకరు దుష్టస్వభావి. ఒక రోజు ఆ గురువు దుష్టస్వభావం కలిగిన మనుషుల్ని వెతికి తెమ్మని సజ్జనుడికి, మంచి బుద్ధి కలిగిన వ్యక్తుల్ని తీసుకురమ్మని దుష్టస్వభావికి చెప్పారు. వారిద్దరూ ఒట్టి చేతులతో తిరిగొచ్చారు. మంచివాడికి దుష్టులు కనిపించలేదు. దుష్టుడికి సజ్జనులెవరూ తారసపడలేదు. ఈ నేపథ్యంగా ‘మనం ఏమి విత్తుతామో దాన్నే కోసుకుంటాము’ అంటారు క్రీస్తు ప్రభువు. మంచితనం మూర్తీభవించిన మనిషికి అందరూ మంచివారిగానే కనిపిస్తారు. దృష్టిని బట్టే సృష్టి! ప్రపంచం సరిగా లేదనడం కాదు, అందులో మనం సరిగా ఉండాలి. అప్పుడే మనిషి సంపూర్ణ మానవుడిగా, మహోన్నతుడిగా మారతాడు. అలాగే ‘సాటి మనుషులు మీకేం చెయ్యాలని కోరుకుంటారో, మీరూ వారికి అలాగే చెయ్యండి’ అన్నది క్రీస్తు వాణి. పొరుగు వ్యక్తి నీకు హాని తలపెట్టాలని అనుకుంటావా? అలాగే నీ నుంచి అతడూ మంచిని, ప్రేమనే ఆశిస్తాడు. ప్రభువు చెప్పిన విశ్వ ప్రేమ సూత్రం, ‘నీలాగే పొరుగువారిని ప్రేమించడం’ ఇందులో కనిపిస్తుంది.

- ఎం.సుగుణరావు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని