సందేహం

Published : 24/06/2021 01:28 IST
నేనూ కృషీవలుణ్నే!

బుద్ధం శరణం..

బుద్ధుడు కపిలవస్తులో బస చేసి ఉన్నాడు. వ్యవసాయం చేసుకునే ఒక పండితుడు ఆయన దగ్గరికి వెళ్లి, ‘స్వామీ! మీరూ మాలాగా పంటలు పండించి ఆ ఫలాల్ని మీరనుభవించి నలుగురికీ పంచిపెట్టవచ్చు కదా. సోమరిగా, పరాన్నభుక్కులా ఎందుకు జీవిస్తున్నారు?’ అని అడిగాడు. దానికి బుద్ధుడు ప్రసన్న దరహాసంతో ‘పండితోత్తమా! నేనూ కృషీవలుణ్నే. ధర్మక్షేత్రమే నా వ్యవసాయ భూమి! దాన్ని జ్ఞానమనే నాగలితో దున్నుతాను. శ్రద్ధ, పవిత్రత అనే విత్తనాలు చల్లుతాను. అనవసరపు కోరికలు అనే కలుపుమొక్కలు పీకిపారేస్తాను. మంచి కర్మలు అనే వర్షపు నీటితో అన్ని దుఃఖాల్ని హరించే నిర్వాణ ఫలాల్ని పండిస్తున్నాను. ఇది చాలదంటావా? మనిషి అన్ని దుఃఖాలకు కారణం కోరికలు, ఆశలు. వాటి నుంచి బయటపడకుంటే మనశ్శాంతి ఉంటుందా? అందుకే, మానవ హృదయ క్షేత్రంలో రాగ, ద్వేష, మోహాల్ని, తృష్ణల్ని నశింపజేసే కృషి చేస్తున్నాను’ అన్నాడు బుద్ధుడు. ఆ మాటలతో తథాగతుడి పట్ల పండితుడికి వ్యతిరేకత మాయమయ్యింది. వెంటనే ఆయన అనుయాయిగా మారిపోయాడు.

- ఎం.మయూఖ

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని