Published : 10/06/2021 01:34 IST
వారే వెలుగు

క్రీస్తువాణి

మానసిక వికాసం, మనోబలంతో ముందుకు సాగే వ్యక్తి తనతో పాటు తోటి వారినీ నడిపిస్తాడు. అలాంటి వారిని క్రీస్తు ప్రభువు ‘మీరు లోకానికి వెలుగై ఉన్నారు’ అని సంబోధించారు. ‘నరుని ఆత్మ దేవుని దీపం’ అంటుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్‌. ఆ దీపం నలుగురికీ వెలుగు పంచాలి. వెలగకుండా వంద దీపాలు గదిలో ఉంటే ఉపయోగం లేదు. వెలిగించిన ఒక్క గోరంత దీపమే కొండంత వెలుగు. మన మనోబలం కూడా ఆ దీపం లాంటిదే. దాన్ని వెలికి తీస్తేనే జీవితానికి వెలుగు. దాన్ని పదిమందికీ పంచాలంటే జీవిత కిటికీలను విశాలం చెయ్యాలి. నూనె అయిపోకుండా దానికి నిత్యం మానసిక స్థైర్యం అనే చమురు పోయాలి. వత్తికి దిగులు, దైన్యం అనే మసి పట్టకుండా చూసుకోవాలి. అప్పుడే ప్రతి మనిషీ లోకానికి వెలుగు దివిటీ అవుతాడు. ‘గోధుమలకు, పొట్టుకు తేడా ఉంది. గోధుమల్లో జీవం ఉంది. అవి మొలకెత్తి పంటనిస్తాయి. రొట్టెలుగా మారి ఆహారం అవుతాయి. పొట్టుకి విలువ లేదు. దాన్ని పారేస్తారు. కాలుస్తారు. మనిషి జీవితం అందరికీ ఉపయోగపడే గోధుమ గింజలా ఉండాలి’ అంటారు క్రీస్తు.

- ఎం.సుగుణరావు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని