Published : 10/06/2021 01:34 IST
ఇంకా మోస్తున్నావు!

జెన్‌ కథ

క్ష్యం సాధించే క్రమంలో ఆయా విషయాలు ఆటంకంగా మారకూడదని కొన్ని నియమాలు, నిష్ఠలు విధిస్తారు పెద్దలు. కేవలం భౌతికంగా వాటికి దూరంగా ఉంటూ మానసికంగా వాటిపట్ల దృఢ చిత్తంతో లేకుంటే ప్రయోజనం శూన్యం. ఈ విషయాన్ని తెలియజెబుతుంది ఓ జెన్‌ కథ. ఇద్దరు జెన్‌ సన్యాసులు ప్రయాణం చేస్తూ ఒక నది దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఓ మహిళ నదిని దాటాలని చూస్తోంది. ‘మాది అటు పక్క గ్రామం. పొద్దున మామూలుగానే ఉన్న నదీ ప్రవాహం ఇప్పుడు పెరిగింది. దయచేసి నన్ను అటువైపు తీసుకెళతారా?’ వారిద్దరినీ అభ్యర్థనగా అడిగిందామె. వారిలో ఒక సన్యాసి అందుకు నిరాకరించాడు. మరో సన్యాసి ఆమెని తన భుజాల మీద ఎక్కించుకొని నది దాటించాడు. కృతజ్ఞతలు చెప్పి ఆమె వెళ్లిపోయింది. ‘మిత్రమా! నువ్వు ఆమెని నది ఎందుకు దాటించావు. మహిళలకి దూరంగా ఉండాలని మన ఆధ్యాత్మిక శిక్షణలో గట్టిగా చెప్పారు కదా!’ ఉండబట్టలేక నిరాకరించిన సన్యాసి అడిగాడు. ఆ మాటలకి సాయం చేసిన సన్యాసి నవ్వుతూ ‘మిత్రమా! సాయం అవసరమైన ఓ మనిషికి నావంతు నేను తోడ్పడ్డాను! నది దాటించాక ఆమెని నేను ఆ ఒడ్డున వదిలేశాను. కానీ, నువ్వే ఇంకా మోస్తున్నావు’ అన్నాడు. రెండో సన్యాసి అపరాధభావంతో  తల దించుకున్నాడు.

- ఎం.అక్షర

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని