Updated : 03/06/2021 05:56 IST
శిరోభారం ఎందుకు?

క్రీస్తువాణి

కీకారణ్యంలో నడుస్తున్నప్పుడు దారిచూపే వ్యక్తి ఉంటే ఎంత మేలు! అయితే, అతను మనలోనే ఉన్నాడు. అతని పేరే ధైర్యం! ‘మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం దక్కుతుంది’ అంటారు క్రీస్తు ప్రభువు. మనలో అందరికీ గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించి భయం, వర్తమానం గురించి అనుమానం ఉంటాయి. ఈ క్రమంలో ‘రేపటి గురించి ఆలోచించవద్దు’ అంటూ వర్తమానంలో ఆ క్షణంలోనే జీవించాలని పేర్కొంటారు ప్రభువు. నిన్న, రేపటి రోజులను మనసులో మోస్తే శిరోభారం, మానసిక ఆందోళన తప్ప ప్రయోజనం ఉండదు. అడిగే ప్రతి వాడికి దొరుకుతుంది. అయితే, మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారో అది మీరు వారికి చేయండి అంటున్నారు క్రీస్తు. ఒక ధైర్య వచనం, ఒక ఆత్మీయ స్పర్శ, ఒక ఓదార్పు మాట ఇతరులకు అందిస్తే అవే మనకు అలాగే లభిస్తాయి. లోకంలో శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యంగా ఉండండి. ఆ దుఃఖాలు, శ్రమలకు సమాధానం ఆనందం అనే అంతిమ విజయం అన్నది క్రీస్తు వాణి.

- ఎం.సుగుణరావు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని