Published : 13/05/2021 00:19 IST
ప్రతిఫలానికి కృతజ్ఞత!

మే 14 రంజాన్‌ పర్వదినం

రంజాన్‌ మాసంలో ముప్పై రోజులు ఉపవాసాలు పాటించి రాత్రిళ్లు నమాజులో నిలబడిన వారందరికీ పండగ ముందు రోజు అల్లాహ్‌ తగిన ప్రతిఫలాన్ని ప్రకటిస్తారు. దానికి కృతజ్ఞతగానే షవ్వాల్‌ నెల 1న ఈదుల్‌ ఫిత్ర్‌ (రంజాన్‌) పండగ జరుపుకుంటారు. పండగ నమాజుకు ముందురోజు రాత్రిని ‘లైలతుల్‌ జాయిజా’ అంటారు. అంటే, రోజా రోజుల్లో జరిగిన తప్పిదాలపై ఆత్మపరిశీలన చేసుకునే రాత్రి అని అర్థం. ఈదుల్‌ ఫిత్ర్‌ పండగను కూలి తీసుకునే రోజుగా ప్రవక్త (స) వర్ణించారు. మండే ఎండలను లెక్కచేయకుండా నెల రోజుల పాటు ఆకలి దప్పులను సహించి చేసిన రోజాలు, నమాజులు, జకాత్‌, దానాలకుగాను అల్లాహ్‌ నుంచి కూలీ తీసుకునే రోజు ఈదుల్‌ ఫిత్ర్‌.  
* ఈదుల్‌ ఫిత్ర్‌ను ప్రవక్త (స) సంతోషంగా జరుపుకునేవారు. పర్వదినం నాడు కొత్త దుస్తులు ధరించి అత్తరు, సుర్మా పూసుకునేవారు. పండగ నమాజుకు ముందే ఫిత్రా దానం చేసేవారు.
* అసలు ఈ పండగకు ‘ఈదుల్‌ ఫిత్ర్‌’ అనే పేరు రావటానికి కారణం ఫిత్రా దానాలు. పండగ నమాజు కంటే ముందే స్తోమత గలవారు రెండున్నర కిలోల గోధుమలు లేదా వాటికి సరిపడా ధనాన్ని లెక్కకట్టి నిరుపేదలకు పంచాలి అన్న ప్రవక్త (స) ఉద్బోధను ముస్లింలు తప్పకుండా పాటిస్తారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పేర లెక్కకట్టి నిరుపేదలకు పంచుతారు. పేదలు కూడా పండగ నాడు పస్తులుండకూడదన్నదే ఫిత్రా దానం పరమార్థం. రంజాన్‌ ఇచ్చిన శిక్షణ స్ఫూర్తి మిగతా 11 నెలలూ తొణికిసలాడాలన్నదే అల్లాహ్‌ అభిమతం. అలాంటి వారికే ఈద్‌ ముబారక్‌ అన్నది ప్రవక్త (స) అందించిన శుభవార్త.ారక్‌ ఇలా..
* కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సారి నమాజును ఎవరింట్లో వారే చేసుకోవాలని ఉలమాలు సూచించారు. కరచాలనాలు, ఆలింగనాలు లేకుండా భౌతిక దూరం పాటిస్తూ ఈద్‌ ముబారక్‌ శుభాశీస్సులు అందించుకోవాలని తెలిపారు. పండగ పూట బంధువులను కలుసుకోవటానికి బయటికి వెళ్లొద్దని, ఎవరిళ్లల్లో వారుంటూ పండగ సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

- ఖైరున్నీసాబేగం

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని