Published : 13/05/2021 00:19 IST
వాటికి పోటీ!

క్రీస్తు వాణి

‘ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. సంతోషించే వారితో సంతోషించండి’ అంటారు క్రీస్తు ప్రభువు. కొంతమంది తమకంటే చదువులో, పదవిలో, సృజనాత్మకతలో అధికులు ఎదురైతే కుంగిపోతారు. ఆత్మన్యూనతా భావానికి లొంగిపోతారు. ఇంకొన్ని సార్లు ద్వేషంతో, అసూయతో రగిలిపోతారు. వారిని ఉద్దేశిస్తూ... ఇతరుల గెలుపు చూసి ఆనందించే మంచి మనసు కలిగి ఉండమంటున్నారు ప్రభువు. అలాగే ‘జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు’ అంటారు క్రీస్తు. మరి దేన్ని బట్టి అతిశయించాలి? ప్రభువు విషయంలో అతిశయించాలి. ప్రభువు అంటే ప్రేమ, కరుణ, సేవ. ప్రతి మనిషీ ఇంకో మనిషితో పోటీపడాల్సింది మంచితనం, మానవత్వం, కరుణలో. ప్రతి మనిషీ ఎదుటి వారి ఔన్నత్యం, మలినం కాని అంతరంగం చూసి.. ఇతను మహోన్నతుడు, ఇతనిలా నేను ఉన్నానా? అని తరచి చూసుకోవాలి. ప్రాపంచిక, అశాశ్వత విషయాల్లో కాకుండా ఆత్మీయ సంపదల కోసం పోటీ పడమంటున్నారు క్రీస్తు ప్రభువు.

- ఎం.సుగుణరావు

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని