శివం కేశవం!
ఉపవాసంలో గొప్ప ఆరోగ్య భావన ఇమిడి ఉంది. ఆ నియమం జీర్ణ శక్తిని సమస్థితిలో ఉంచుతుంది. ఖాళీ అయిన కడుపులో ఆహార పదార్థాలుగా ఆ కాలంలో మాత్రమే దొరికే ఉసిరి, వెలగ, లేత చింత వంటి ఓషధులు, లేత గుమ్మడి లాంటి కూరలు, జినుగులు, బొబ్బర్లు వంటి పప్పుదినుసులు తినాలనే నియమం ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యానే ఏర్పాటుచేశారు.