సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

సరిహద్దుల్లోనే ఆపేశారు

రాష్ట్రంలో ఒక్కోచోట ఒక్కోలా తనిఖీలు
కొన్నిచోట్ల పాస్‌లు ఉంటేనే అనుమతి
మరికొన్నిచోట్ల క్వారంటైన్‌కు తరలింపు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం: ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే వారిని రాష్ట్రంలోకి అనుమతించే విషయంలో సరిహద్దు జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కో విధానాన్ని అమలు చేయడంతో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల అనుమతి పత్రాలు (ఈ-పాస్‌) మాత్రమే పరిశీలించి అనుమతించారు. ఇంకొన్ని చోట్ల ఈ-పాస్‌తోపాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరిణామాలతో సరిహద్దు ప్రాంతాల్లో కొన్నిచోట్ల వాహనాలు బారులు తీరి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 5వ విడత లాక్‌డౌన్‌లో భాగంగా ఈ నెల 1 నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన అనేకమంది సోమవారం ప్రయాణమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునేవరకు అంతర్రాష్ట్ర ప్రయాణాలపై షరతులు కొనసాగుతాయని ఆదివారం అర్ధరాత్రి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ-పాస్‌ తప్పనిసరి చేయడంతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపారు. దీంతో సొంత రాష్ట్రంలో అడుగుపెడదామని ఆశపడి వచ్చిన వారికి అనుకోని కష్టాలు ఎదురయ్యాయి.
* గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద తెలంగాణ వైపు నుంచి వచ్చిన వారి ఆధార్‌ నంబరు, చిరునామా, సెల్‌ నంబరు పోలీసులు నమోదు చేసుకున్నారు. వైద్యులు పరీక్షించి స్వాబ్‌ తీశారు. గుంటూరు జిల్లాకు చెందినవారికి స్వాబ్‌ తీయడంతోపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ముద్ర వేసి పంపారు. నాగార్జునసాగర్‌ సరిహద్దులో ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించడం లేదు.
* జాతీయ రహదారిలో కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసు తనిఖీలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు బారులు తీరాయి. ఉదయం 9 తర్వాత వందల సంఖ్యలో వాహనాలు రావడంతో రోడ్డుపై అర కిలోమీటర్‌ మేర రద్దీ ఏర్పడింది. రోజూ వచ్చే వాహనాల కంటే అధికంగా వెయ్యి వరకు సరిహద్దులు దాటి రాష్ట్రంలో ప్రవేశించాయి. ఈ-పాస్‌లున్న వాహనాలను మాత్రమే అనుమతించడంతో అవి లేకుండా వచ్చినవారు అవస్థలు పడ్డారు. ఇక్కడ వైద్య పరీక్షలేవీ కనిపించలేదు.
* కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో సరిహద్దు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రాష్ట్రాల నుంచి చిత్తూరు జిల్లాలోకి వచ్చేవారికి సరిహద్దు చెక్‌పోస్టుల్లో అనుమతి పత్రాలు పరిశీలించి, క్వారంటైన్‌కు పంపారు. పలమనేరు మండలం నంగిలి, సత్యవేడు మండలం రాచకండ్రిగ, మదనపల్లె మండలం చీకలబైలు, కుప్పం మండలంలోని పలు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సోమవారం ఉదయం నుంచే సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు, మూడు చెక్‌పోస్టుల వద్ద వైద్యులు పరీక్షలు కూడా నిర్వహించారు. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతులున్నా క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు. ఈ-పాస్‌ లేకుండా వచ్చిన వారందర్నీ వెనక్కి పంపేశారు.
* తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వస్తున్నవారిని కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. అనుమతి పత్రాలున్న వాహనాలనే వెళ్లనిచ్చారు. ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు.
* శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురపాలక పరిధిలోని పురుషోత్తపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఒడిశా నుంచి వచ్చేవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలొచ్చే వరకు అక్కడే ప్రత్యేక శిబిరాల్లో ఉంచారు. నెగిటివ్‌ వచ్చినవారిని అనుమతించి, మిగతావారిని ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.


చంద్రబాబు, లోకేశ్‌కు నేరుగా అనుమతి

ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌ హైదరాబాద్‌ నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీరి కాన్వాయ్‌ సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సరిహద్దులోని కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్దకు చేరుకుంది. వీరికి అనుమతి పత్రాల పరిశీలన, వైద్యపరీక్షలు ఉంటాయని అధికారులు తొలుత భావించారు. చివరి నిమిషంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహనశ్రేణిని నేరుగా రాష్ట్రంలోకి పంపారు.


మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని