సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

ఆ 6 రాష్ట్రాల వారితో జాగ్రత్త!

వారం రోజులు క్వారంటైన్లలోనే
వృద్ధులు, చిన్నారులు, గర్భిణులకు మినహాయింపు

ఈనాడు, అమరావతి: కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని 7 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు (చెన్నై)ల నుంచి వచ్చినవారి నమూనాలను రైల్వే స్టేషన్లలోనే సేకరించాలని సూచించింది. అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లో 7 రోజులు, హోం క్వారంటైన్‌లో మరో 7 రోజులు ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో 60 ఏళ్లు దాటిన వారికి, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవారికి మినహాయింపునిచ్చింది. వీరు తప్పనిసరిగా ఇళ్లలో 14 రోజుల పాటు ఉండేలా చూడాలంది. ప్రభుత్వాధికారులు, వ్యాపారులు, వైద్య నిపుణులకు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల నుంచి మినహాయింపునిచ్చింది.

హైదరాబాద్‌ నుంచి వచ్చే వారికి ర్యాండమ్‌ పద్ధతిలో పరీక్షలు
తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి భారీగా రైళ్ల ద్వారా రాష్ట్రానికి ప్రయాణికులు వస్తారని అంచనా. ఇందులో భాగంగా ప్రతి బోగీలో 5% ప్రయాణికుల నుంచి ర్యాండమ్‌ పద్ధతిలో నమూనాలు సేకరించాలని అధికారులకు సూచించింది. వారం పాటు ఇలా పరిశీలించాక తదుపరి చర్యల్లో మార్పులు చేస్తామంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలను యాప్‌లో నమోదుచేయాలని వెల్లడించింది.

రాష్ట్రంలోనే ప్రయాణిస్తే మినహాయింపు
రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేవారికి వైరస్‌ అనుమానిత లక్షణాలు లేకుంటే క్వారంటైన్‌ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. టికెట్ల ద్వారా వారి ప్రయాణ వివరాలను నిర్ధారించుకోవాలని చెప్పింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని