సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

టాలీవుడ్‌

పెళ్లి వేడుక మూడు రోజులు

గ్గుబాటి కుటుంబంలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ప్రముఖ కథానాయకుడు రానా ఆగస్టు 8న మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. వీరి వివాహాన్ని హైదరాబాద్‌లోనే జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబాలు ఏర్పాట్లు మొదలు పెట్టాయి. పెళ్లి వేడుకల్ని మూడు రోజులపాటు నిర్వహించబోతున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహిస్తారు. కరోనా ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ఈ వేడుకని నిర్వహించాలని ఇరు కుటుంబాల వారు నిర్ణయించారు. ముహూర్తం నాటికి పరిస్థితుల్నిబట్టి వేడుకకి హాజరయ్యే అతిథుల సంఖ్య ఉండబోతోంది. రానాకి కాబోయే భార్య మిహీకా వెడ్డింగ్‌ ప్లానర్‌. ఆమె ఆలోచనలకు అనుగుణంగా, ప్రత్యేకమైన థీమ్‌తో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయట. స్నేహితులుగా ఉంటూ మనసులు ఇచ్చి పుచ్చుకున్న రానా, మిహీకా జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించారు. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా వేడుక జరిగింది. ‘‘నిశ్చితార్థాన్ని నిర్వహించడం లేదని, నేరుగా పెళ్లి చేయబోతున్నాం’’ అని డి.సురేష్‌బాబు ‘ఈనాడు సినిమా’తో తెలిపారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని