శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రెడ్‌మీ8: తొలి 50 లక్షలమందికి ₹1000 తగ్గింపు

రెడ్‌మీ 8కి షావోమీ ఆఫర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమీ వరుసగా కొత్త మొబైళ్లను లాంచ్‌ చేస్తూ అదరగొడుతోంది. ఈ క్రమంలో ‘8’ సిరీస్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో ‘రెడ్‌మీ 8’ను తీసుకొచ్చింది. ఈ మొబైల్‌లో మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు సోనీ ఐఎంఎక్స్‌ 363 సెన్సర్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. 2 మెగాపిక్సెల్ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా కూడా ఉంటుంది. మూడో కెమెరాను 8 మెగాపిక్సెల్‌ ఏఐతో సెల్ఫీలు తీసుకునేందుకు అమర్చారు . 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్‌ 18 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 720x1520 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.22 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ ఉంటుంది. గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తో ఈ మొబైల్‌ను తీసుకొస్తున్నారు.  ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఓఎస్‌తో ఈ ఫోను పని చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌ను అమర్చారు. 

వైర్‌లెస్‌ ఎఫ్ఎం రేడియో, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్, ఏఐ ఫేస్‌ లాక్‌ వంటి ఫీచర్స్‌ రెడ్‌మీ 8లో ఉన్నాయి. రెండు వేరియంట్లలో ఈ మొబైల్‌ లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌ ధర రూ. 7,999. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర రూ. 8,999. మెమొరీ కార్డుతో స్టోరేజిని 512 జీబీ వరకు పొడిగించొచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ను రూ. 7,999కే విక్రయించనున్నారు. అయితే తొలి 50 లక్షల ఫోన్లకే ఈ ఆఫర్‌ ఇస్తున్నారు. ఆనిక్స్‌ బ్లాక్‌, రూబీ రెడ్‌, సఫైర్‌ బ్లూ రంగుల్లో ఈ మొబైల్‌ లభిస్తుంది. అక్టోబరు 12 నుంచి ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోనును కొనుగోలు చేయవచ్చు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని