ముంబయి: భక్తి అనేది మనిషిని ఎంతటి సాహసానికైనా ప్రేరేపిస్తుందనడానికి ఈ వార్త మంచి ఉదాహరణ. మహారాష్ట్రకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధురాలు దేవుడిని దర్శించుకునేందుకు సైకిల్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.. ఆమె ప్రయాణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆమె యాత్ర వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధురాలు కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. ఇందుకోసం ఆమె 2200 కిలోమీటర్ల యాత్రను సైకిల్‌పై చేపట్టారు. కాగా మార్గ మధ్యలో ఆమెను గుర్తించిన ఓ వ్యక్తి ఆమె యాత్రకు సంబంధించిన వివరాలను అడిగి వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వయసులో ఆమె భక్తి కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఆమె తన యాత్రను క్షేమంగా పూర్తి చేయాలని కోరుతున్నా’అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.