శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

యూరియా కొరత రానివ్వం: మంత్రి నిరంజన్‌రెడ్డి

దిల్లీ: తెలంగాణలో రబీ సీజన్‌కు ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం దిల్లీలో కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి సదానందగౌడను కలిసిన ఆయన రబీకి యూరియా కేటాయింపులపై వినతిపత్రం అందజేశారు.  ఈఏడాది వర్షాలు కాస్త ఆలస్యమైనా..రాష్ట్రంలో అధికంగా కోటి 11లక్షల ఎకరాల భూమి సాగులో ఉందని మంత్రి తెలిపారు. ఇటీవల యూరియా రాక కాస్త ఆలస్యం కావడంతో తలెత్తిన ఇబ్బందులు మళ్లీ పునరావృతం కాకుండా.. రబీ కోసం 7.70లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కావాలని కేంద్ర ప్రభుత్వానికి  ఇండెంట్‌ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్రం 7లక్షల మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి కేటాయించిందని, మిగిలిన 70వేల మెట్రిక్‌ టన్నులు కూడా కేటాయించి అక్టోబర్‌లో పంపించాలని కోరినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని