శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

షియా వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్‌ తిరస్కరణ

దిల్లీ : యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అత్యంత సున్నితమైన ఆయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరిస్తోంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌.ఏ.బోడ్బే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌  సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని తేల్చిచెప్పింది. వివాదాస్పద స్థలంపై  షియా వక్ఫ్‌ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని ధర్మాసనం వెల్లడించింది. బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పురావస్తు శాఖల నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని న్యాయ స్థానం పేర్కొంది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందని న్యాస్థానం పేర్కొంది. మందిరాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వివరించింది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని