శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రాజకీయాలు,చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి

దిల్లీ  : అయోధ్యపై చారిత్రక తీర్పును సుప్రీంకోర్టు వెల్లడిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ తీర్పు ప్రతిని చదవి వినిపిస్తున్నారు. ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పు ఇచ్చారు. మొత్తం తీర్పు చదవి వినిపించేందుకు అరగంట సమయం పడుతుందని సీజేఐ  తెలిపారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని ఈ సందర్భంగా రంజన్‌ గొగొయ్‌ పేర్కొన్నారు. షియా వక్ఫ్‌ బోర్డు స్పెషల్‌ లీవ్‌ పటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు.

తుది తీర్పులోని ముఖ్యాంశాలు..
* ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనామందిరం చట్టం పరిరక్షిస్తుంది
* ఇది పెద్దసంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించింది. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు.
* మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది.
* రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది. 
* వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్‌ను సుప్రీం తిరస్కరించింది. నిర్మోహి అఖాడా వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సీజేఐ వెల్లడి.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని