శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అటు మాస్‌.. ఇటు క్లాస్‌ డేట్స్‌ ఫిక్స్‌..

హైదరాబాద్‌: రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రవితేజ్‌ గన్‌ పట్టుకుని స్టైల్‌గా నిలబడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. నభానటేష్‌, తాన్యహోప్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరు మొదటి వారంలో ‘డిస్కోరాజా’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని యోచించారు. అయితే, బాలయ్య ‘రూలర్‌’, సాయిధరమ్‌తేజ్‌ ‘ప్రతిరోజు పండగే’, సల్మాన్‌ ‘దబంగ్‌3’ చిత్రాలు విడుదలవుతుండటంతో పాటు, ‘డిస్కోరాజా’ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తికాకపోవడంతో సినిమా విడుదలను జనవరికి మార్చుకున్నారు. 

సంక్రాంతి బరిలోనే కల్యాణ్‌రామ్‌
ఈసారి సంక్రాంతి పండగకు టాలీవుడ్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటికే మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు విడుదల తేదీలను ఖరారు చేయగా, ఇప్పుడు సంక్రాంతి బరిలో కల్యాణ్‌రామ్‌ నిలిచారు. ఆయన కథానాయకుడిగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. మెహరీన్‌ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ఉమేష్‌గుప్త, సుభాష్‌ గుప్తలు నిర్మిస్తున్నారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని