గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

లిఫ్టు అడుగుతూ.. మహిళలను వేధిస్తూ..

పోకిరీ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కారులో వెళ్తున్న మహిళలను లిఫ్టు అడిగి వారి ఫోన్‌ నంబర్లను తీసుకుని వేధిస్తున్న కానిస్టేబుల్‌పై బంజారాహిల్స్‌, సైఫాబాద్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీసు(టీఎస్‌ఎస్‌పీ)కి చెందిన 12వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ వీరబాబు ఈ నెల 7న జూబ్లీహిల్స్‌ నుంచి శ్రీనగర్‌కాలనీ వైపు వెళ్తున్న ఓ కారును ఆపి లిఫ్టు కోరాడు. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో విధులకు హాజరుకావాలని కోరడంతో ఆమె సరే అన్నారు. కారులోకి ఎక్కిన ఆయన తన వృత్తి, కుటుంబం గురించి ఆమెకు తెలిపి ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. ఏదైనా అవసరమైతే తనకు ఫోన్‌ చేయాలని సూచించాడు. అతను కారు దిగిన తర్వాత ఆమె తన నివాసానికి చేరుకోగానే పదేపదే ఫోన్‌ చేస్తూ, సందేశాలు పంపిస్తూ వేధిస్తుండడంతో ఆమె షీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 9న వీరబాబుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించి పంపించారు. బయటకు వచ్చిన వీరబాబు లక్డీకాపూల్‌లో ఓ వైద్యురాలి కారును ఆపాడు. పోలీసు దుస్తుల్లో ఉండటంతో ఆమె అతనికి లిఫ్ట్‌ ఇచ్చారు. తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పిన వీరబాబు ఆమె ఫోన్‌ నంబరు తీసుకొని వేధించడం ప్రారంభించాడు. ఆమె శనివారం సైఫాబాద్‌ ఠాణాలో తెలపడంతో కేసు నమోదు చేశారు. అంతకుముందు షీ బృందానికీ ఫిర్యాదు నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వీరబాబు మే నెలలో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు అటాచ్‌గా వచ్చాడని, సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేయడని స్పష్టం చేశారు. వివాహమై పిల్లలున్న వీరబాబుది అనపర్తి ప్రాంతమని తెలిపారు.

తప్పు చేస్తే సహించేది లేదు: కొత్వాల్‌ అంజనీకుమార్‌

మహిళల పట్ల టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ ప్రవర్తన విషయంలో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. పోలీస్‌శాఖలో ఇలాంటివారు ఉండటం సిగ్గుచేటని అన్నారు. ఎవరైనా పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తే 94906 16555 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని