శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

విజయవాడలో నాటు వైద్యం పేరుతో దారుణం

విజయవాడ: నాటు వైద్యం పేరుతో విజయవాడలో దారుణం జరిగింది. నాటు వైద్యం వికటించి కడప జిల్లాకు చెందిన బాలుడు హరనాథ్‌ మృతి చెందాడు. చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... ఓ నాటు వైద్యుడు బుద్ధిమాంద్యానికి చికిత్స చేస్తానంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి బెంగళూరు, బళ్లారి, కడపతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 11 మంది బాధితులు చికిత్స కోసం విజయవాడ వచ్చారు. నాటు వైద్యుడు భూమేశ్వరరావు గవర్నర్‌పేటలోని గంగోత్రి లాడ్జిలో 3 గదులు అద్దెకు తీసుకుని గత నాలుగురోజులుగా వీరికి చికిత్స అందిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం హరనాథ్‌ మృతి చెందడంతో  నాటు వైద్యం విషయం వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాటు వైద్యుడు భూమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని