శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

జిన్‌పింగ్ పర్యటనలో ఏ ఒప్పందాలు ఉండవు

దిల్లీ: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, సంయుక్త అధికారిక ప్రకటనలు ఉండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ భేటీ జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 11, 12న జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో చెన్నై సమీపంలోని చరిత్రాత్మక నగరం మహాబలిపురంలో సమావేశమవుతారు. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రత్యేక ఎజెండా లేదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం సరిహద్దుల్లో శాంతిని పెంపొందించడంపై మాత్రమే చర్చిస్తారన్నారు. ఇక పలు ద్వైపాక్షిక అంశాలు, విదేశాంగ విధానంలో ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మెరుగుపరచడానికి ఈ భేటీ బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. తదుపరి అత్యున్నత స్థాయి సమావేశానికి సంబంధించిన తేదీలను ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు నిర్ణయిస్తారన్నారు. భారత పర్యటనలో జిన్‌పింగ్‌తో పాటు ఆ దేశ విదేశాంగమంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ఉండనున్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని