శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ఆటోపై కంటైనర్‌ బోల్తా:12 మంది దుర్మరణం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్‌ వద్ద వాహనాలపై కంటైనర్‌ బోల్తాపడింది. బ్రేకులు విఫలం కావడంతో ఆటో, ఓమ్ని వ్యాన్‌, ద్విచక్ర వాహనంపైకి కంటైనర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కంటైనర్‌ డ్రైవర్‌ ఉన్నట్లు సమాచారం. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆర్టీసీపై మరోమారు సీఎం కేసీఆర్‌ సమీక్ష

సమ్మె కొనసాగింపు, హైకోర్టు వరుస విచారణల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై మరోమారు సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్న హైకోర్టు సూచన నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు 5,100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతుల విషయంలోనూ ముందుకెళ్లరాదన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపైనా సమీక్షలో చర్చిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు:చంద్రబాబు

వైకాపా అరాచకాలు తీవ్రమయ్యాయని.. రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కార్యకర్తలతో మూడో రోజు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ‘అగ్రిగోల్డ్‌ భూములు కొట్టేసేందుకు యత్నించారు’

తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ అవినీతి జరిగితే డిపాజిటర్లకు అప్పటి ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు యత్నించారే తప్ప బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘పోటీపడాలంటే ఆంగ్లమాధ్యమం తప్పనిసరి’

ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరమని భావించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యానికి కొరత లేదని.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందాలంటే ఆంగ్లమాధ్యమం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది నుంచి క్రమంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని మంత్రి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మాట నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది: ఉద్దవ్‌

మహారాష్ట్రలో కూటమితో కూడిన ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇప్పుడు భాజపా చేతుల్లోనే ఉందని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఒకవేళ కుదరకపోతే తమ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అమలుచేస్తామని తేల్చి చెప్పారు. ఏదో ఒకరోజు శివసేన నాయకుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని.. తన తండ్రి బాల్‌ ఠాక్రేకు మాట ఇచ్చానని, ఇప్పుడు దాన్ని నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ప్రతిపక్షాలు కూడా ఎప్పుడూ అలా దూషించలేదు

ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడడానికి శివసేనే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. ‘‘గత 15 రోజులుగా శివసేన చేస్తున్న ప్రకటనలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మోదీపై కూడా విమర్శలు చేశారు. కానీ భాజపా నేతలెప్పుడూ బాల్‌ఠాక్రేని గానీ, ఉద్ధవ్‌ను గానీ విమర్శించలేదు. మోదీని ప్రతిపక్ష నేతలు కూడా ఎప్పుడూ అలా దూషించలేదు. ఆ పార్టీ వైఖరి చూస్తుంటే కూటమిలో ఉండడం ఇష్టం లేదనిపిస్తోంది’’ అని ఫడణవీస్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. గుడ్‌న్యూస్‌: ఇకపై నెఫ్ట్‌ ఛార్జీలుండవ్‌

నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఇకపై ఉండబోవు. ఈ మేరకు ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. శాంసంగ్‌ డివైజ్‌ల్లో ఆగిపోనున్న నెట్‌ఫ్లిక్స్‌

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్ శాంసంగ్‌ యూజర్స్‌కి షాకిచ్చింది. డిసెంబరు 1 నుంచి కొన్ని శాంసంగ్‌ టీవీ మోడల్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు శాంసంగ్‌ ఒక ప్రకటన చేసింది. 2010-11లో తయారైన కొన్ని మోడల్స్‌ టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ ఆగిపోనుంది. టీవీల స్క్రీన్‌ సైజ్‌ పక్కన సీ, డీ అనే అక్షరాలు ఉండే టీవీలకు మాత్రమే సేవలు నిలిచిపోతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అడ్వాణీ ఇంటికి ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీని కలిశారు. అడ్వాణీ జన్మదినం సందర్భంగా దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అడ్వాణీ కుటుంబసభ్యులతో వెంకయ్య కాసేపు గడిపారు. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అక్కడికి వచ్చి అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని