☰
బుధవారం, ఏప్రిల్ 21, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 22/02/2021 14:54 IST
విజయన్‌ అడుగుజాడల్లో కమల్‌!

కేరళ ప్రభుత్వ వ్యూహాలను అనుసరిస్తున్న కమల్‌ హాసన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ కేరళ సీఎం పినరయి విజయన్‌ దారిలో నడుస్తున్నారు. గెలుపు కోసం లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే వామపక్షాల ఇలాఖాలో ఫలించిన వ్యూహాలు ద్రవిడనాట ప్రభావం చూపుతాయా?, తమిళనాట ద్విముఖ పోరుకు చరమ గీతం పాడి మూడో పార్టీకి ఆధిక్యం కట్టబెడతాయా అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. 

తమిళనాడులో దశాబ్దాలుగా ద్విముఖ పోరు సాగుతోంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రంగప్రవేశంతో ఈ ఆనవాయితీకి తెరపడుతుందని భావించినప్పటికీ తలైవా వెనక్కి తగ్గడంతో అందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌తో ప్రతిపక్ష డీఎంకే, మరో వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో అధికార అన్నాడీఎంకే జట్టుకట్టాయి. 2018లో రాజకీయ పార్టీ ప్రారంభించి గత సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లు దక్కించుకున్న కమల్‌ పార్టీ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం కేరళలో ఎల్‌డీఎఫ్‌ అమలు చేసిన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ సీఎం పినరయి విజయన్‌ను కమల్‌ తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఈ విషయాన్ని గతంలో ఆయన బహిరంగంగానే వెల్లడించారు. కమల్‌ ఇప్పుడు తన గురువు దారిలోనే నడిచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు.

డిసెంబర్‌లో జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ అఖండ విజయం సాధించింది. ప్రజల్లో పేరున్న వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పబ్లిక్‌ సర్వెంట్ల ద్వారా ఓటర్లను ఆకర్షించింది. ఇప్పుడు కమల్‌ సైతం అదే విధంగా పావులు కదుపుతున్నారు. పేరున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. విశ్రాంత ఐపీఎస్‌ ఏజీ మౌర్య ఇటీవలే పార్టీలో చేరారు. ఐఏఎస్‌ అధికారి డా.సంతోష్‌కుమార్‌ సైతం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి మక్కల్‌ నీది మయ్యమ్‌లో చేరారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పొన్‌రాజ్‌తోపాటు వీఆర్‌ఎస్‌ తీసుకున్న మరో ఐఏఎస్‌ అధికారి సఘాయమ్‌ కమల్‌ పార్టీలో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అరాప్పోర్‌ ఇయాక్కమ్‌, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే పూవులాగిన్‌ నన్‌బార్గల్‌ సంస్థతో కమల్‌ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా మంచి పేరున్న వ్యక్తులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సఘాయమ్‌, పొన్‌రాజ్‌లను శాసనసభ ఎన్నికల బరిలోకి దించాలని కమల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ సీఎం విజయన్‌ మార్క్‌ రాజకీయాలు తమిళనాట ఏ మేరకు ఫలిస్తాయన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.


ఇవీ చదవండి

  • పుదుచ్చేరి ‘పరీక్ష’.. నారాయణస్వామి గట్టెక్కేనా?

  • జైలు పేరుతో బెదిరించలేరు: మమతా బెనర్జీ

Tags: political newsపొలిటికల్‌ వార్తలుtamilnaduతమిళనాడుkeralaకేరళKamal Haasanకమల్‌ హాసన్‌makkal needi mayyamమక్కల్‌ నీది మయ్యమ్‌pinarayi vijayanపినరయి విజయన్‌electionsఎన్నికలు

రాజకీయం

  • రాత్రి కర్ఫ్యూ కంటితుడుపు చర్య: భట్టి[01:43]
  • ఒకే దేశం.. ఒకటే ధర: కాంగ్రెస్‌[01:41]
  • ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదేం?[01:40]
  • దేవినేని ఇంటికి సీఐడీ అధికారులు[01:45]

జనరల్‌

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం[01:46]
  • టీకా తీసుకుంటే టమోటాలు ఫ్రీ..[01:42]
  • కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..[01:41]
  • కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?[01:39]
  • అగ్నిపర్వతం విస్ఫోటనం.. ప్రజలు విలవిల[00:23]
  • సాహో శిల్పా సాహు.. [01:44]

సినిమా

  • భారతీయులకు ప్రియాంక చోప్రా అభ్యర్థన[01:44]
  • పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు[01:42]
  • ‘వకీల్‌సాబ్‌’పై జస్టిస్‌ గోపాలగౌడ ప్రశంసలు[01:41]
  • చిత్రసీమ ఎక్కడైనా ఒక్కటే: రష్మిక[01:39]
  • వారి మృతి నా హృదయాన్ని కలచివేసింది: చిరంజీవి[01:14]
  • సూరిబాబుగా సుధీర్‌[01:11]
  • ‘విక్రమ్‌’లో సేతుపతి?[01:12]
  • ఆ కోణంలో చూశారంటే...[01:13]
  • హాళ్లపై కరోనా హాలాహలం[01:17]

క్రైమ్

  • ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...[02:09]
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌[01:39]
  • దంతెవాడ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం[01:41]

స్పోర్ట్స్

  • ధోనీ వారసుడిగా జడేజా..[01:42]
  • అజాగ్రత్త వద్దు మిత్రమా.. కరోనా కోరలు చాచింది  [01:40]
  • షాప్‌కీపర్ అవతారమెత్తిన సానియా కొడుకు[01:38]
  • MS Dhoni: ఎనిమిదేళ్ల నాటి ట్వీట్‌ వైరల్‌[01:43]

బిజినెస్

  • కొత్త రుణగ్రహీతలకూ క్రెడిట్‌ స్కోరు[01:56]
  • ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత: హీరో మోటో[01:55]
  • +529 నుంచి -244కు[01:53]
  • సాంకేతికతతో రోజుకు కోటి మందికి టీకా[01:49]
  • స్పుత్నిక్‌ వి ధర రూ.750?[01:43]
  • ఐఎస్‌బీ దేశంలోనే నెం.1[01:32]
  • కొవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచుతాం[01:28]
  • కొవిడ్‌ ప్రభావిత రాష్ట్రాలకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌[01:16]
  • మున్ముందూ ఆన్‌లైన్‌ ఆర్డర్లలో వృద్ధి[01:09]
  • మధ్యవర్తిత్వం కోసం భారత కంపెనీలు బయటకెళ్లొచ్చు[01:05]
  • అత్యవసర నిధి ఎంతుండాలి?[00:57]
  • ఫండ్ల సంఖ్యను తగ్గించుకోవాలంటే..[00:55]
  • వార్షిక ఆదాయమే..కీల‌కం[12:42]
  • రుణ దర‌ఖాస్తు రిజ‌క్ట్ కాకుడ‌దంటే..  [15:36]

జాతీయ-అంతర్జాతీయ

  • భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం[01:42]
  • అమెరికాలో 16దాటిన వారికి టీకా..![01:40]
  • Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి![01:37]
  • మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?[01:43]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?
  • భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌
  • సాహో శిల్పా సాహు.. 
  • Curfew: తెలంగాణలో రోడ్లు నిర్మానుష్యం
  • Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి!
  • పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు
  • Lockdown ఆఖరి అస్త్రం కావాలి: మోదీ 
  • మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?
  • కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.