శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కలిసి పనిచేస్తాం: కాకాణి, కోటంరెడ్డి

అమరావతి: పార్టీకోసం జిల్లాలో నేతలంతా కలిసి పనిచేస్తామని నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో వైకాపా నేతల మధ్య ఆధిపత్యపోరుపై ఇద్దరు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. సీఎంతో భేటీ అనంతరం కోటంరెడ్డి  శ్రీధర్‌రెడ్డి, కాకాణి మీడియాతో  మాట్లాడారు.
‘‘రైతు భరోసా, సీఎం సభపై మాత్రమే చర్చించాం. సభను బాగా నిర్వహించాలని సీఎం జగన్‌ కోరారు. అధికారి పెట్టిన కేసు అవాస్తవమని గతంలోనే చెప్పా. ప్రభుత్వ అధికారి ఫిర్యాదు వల్లే చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే కాకాణి మా మేనత్త కొడుకు. రొట్టెల పండుగకు ఆయన ఇంటికి వెళ్లా. మా మధ్య విభేదాలు తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు’’ అని కోటంరెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. ఏమైనా విభేదాలు వస్తే మేమే పరిష్కరించుకునేంత సాన్నిహిత్యం ఉంది. మా మధ్య వివాదాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం జిల్లాలో నేతలంతా కలిసి పనిచేస్తాం. కోటంరెడ్డి నా బావమరిది. చిన్నప్పటి నుంచి మేం మంచి స్నేహితులం అని వివరించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని