శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

అమరావతి: ఏపీలో అఖిలభారత సర్వీసు అధికారులను బదిలీ చేయటంతో పాటు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్‌ ప్లానింగ్‌ సొసైటీ సీఈవోగా ఉన్న సంజయ్‌గుప్తాను బదిలీ చేస్తూ అటవీశాఖ చీఫ్‌ కన్సర్వేటర్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. పురపాలకశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌కు ఏపీ ప్లానింగ్‌ సొసైటీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ సుమిత్‌ కుమార్‌కు ఇసుక విధానం అమలుకు సంబంధించి పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులశాఖ ప్రత్యేక కార్యదర్శిగా
అదనపు బాధ్యతలు అప్పగించారు. సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న ఎం.హరినారాయణ్‌కు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల శిక్షణ బాధ్యతలను అప్పగించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న  వి.కోటేశ్వరమ్మను ప్రణాళికా విభాగంలో డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రత్యేకంగా సామాజిక బాధ్యతల అంశాన్ని పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని