శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

దేశవ్యాప్తంగా కొనసాగుతున్నపటిష్ఠ భద్రత

దిల్లీ: దేశ చరిత్రలో కీలక తీర్పుగా భావిస్తున్న అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్ సహా దిల్లీ, మధ్యప్రదేశ్‌లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. తాజాగా రాజస్థాన్, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలకు నేడు సెలవులు ప్రకటించాయి. అలాగే భరత్‌పూర్‌ సహా మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో రేపు ఉదయం 6గంటల వరకు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం తెలిపింది. జైసల్మేర్‌లో ఈ నెల 30వరకు సెక్షన్‌ 144 విధిస్తున్నట్లు వెల్లడించారు. తీర్పు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్‌ఆర్టీసీ).. అధికారులను అందుబాటులో ఉండాలని ఆదేశించింది. స్థానిక పోలీసులతో కలిసి సమన్వయం చేసుకోవాలని తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏదైనా అనుకోని ఘనటలు చోటుచేసుకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కేస్‌ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది.

అటు జమ్మూకశ్మీర్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒవైపు కర్తార్‌పూర్ నడవా ప్రారంభం, మరోవైపు అయోధ్య తీర్పు నేపథ్యంలో పంజాబ్‌లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా కీలక ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ సందేశాలు వ్యాప్తి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయోధ్య ప్రాంతంలోనూ కట్టుదిట్టమైన పహారా కొనసాగుతోంది. రాత్రి మొత్తం పోలీసులు రామజన్మభూమి, అయోధ్య ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. అయోధ్య నగర శివారుల్లో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ముందు నుంచే అయోధ్యలో భారీ భద్రతా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే.

మరోవైపు కీలక తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అందులో భాగంగా దిల్లీ పోలీసులు, రాజస్థాన్ ఆర్మ్స్‌, సీఆర్‌పీఎఫ్‌లు పహారా కాస్తున్నారు. అయోధ్య సహా యూపీ అంతా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అటు ఈ కేసు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకూ భద్రతను పెంచారు. ప్రధాని న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయికి జెడ్‌ ప్లస్‌ తరహా భద్రత కల్పించారు. వారి నివాసాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయమూర్తులంతా పూర్తి భద్రత మధ్య నేడు కోర్టుకు వెళ్లనున్నారు.

తీర్పును గౌరవించండి: గడ్కరీ
అయోధ్య భూవివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యలో రామాలయ ప్రధాన పూజారి మహంత్‌ సత్యేంద్ర దాస్‌ స్పందిస్తూ.. ప్రధాని మోదీ చెప్పినట్లు అయోధ్య తీర్పు ఏపక్షానికి విజయమూ కాదని.. ఓటమి కూడా కాదని వ్యాఖ్యానించారు. తీర్పుని గౌరవించి ప్రతిఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని