☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 22/01/2021 12:14 IST
ఆసీస్‌ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి   

ఆస్ట్రేలియా ఇకపై మేటి జట్టు కాదన్న ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఇకపై మేటి జట్టు కాదని, అదెప్పుడో గతంలోని మాట అని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌స్వాన్‌ విమర్శించాడు. ఇటీవల జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు బలమైన ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన స్వాన్‌.. ఇంగ్లాండ్‌ జట్టు ఇక మీదట యాషెస్ సిరీస్‌ గురించి కాకుండా టీమ్‌ఇండియాపై దృష్టి సారించాలని అన్నాడు. 

‘ఇంగ్లాండ్‌ టీమ్‌ ఇంతకుముందెప్పుడూ యాషెస్‌ సిరీస్‌ గురించే మాట్లాడేది, అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం అత్యుత్తమ జట్టు కాదు. అది గతంలో అలా ఉండేది. కానీ, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఆ జట్టుతో యాషెస్‌ సిరీస్‌ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇకపై అది మర్చిపోయి ముందుకు సాగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాను వారి సొంత గడ్డపై ఓడించడం అన్నింటికన్నా పెద్ద విశేషం. 2012లో భారత పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్‌ టీమ్‌ఇండియాను ఓడించింది. ఆ తర్వాత భారత్‌ బలంగా మారింది’ అని స్వాన్‌ పేర్కొన్నాడు.

‘ఇంగ్లాండ్‌ ఇప్పుడు నంబర్‌ వన్‌ జట్టుగా ఎదగాలంటే ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించాలనే విషయాన్ని వదిలేసి టీమ్‌ఇండియాపై దృష్టి పెట్టాలి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని, టీమ్‌ఇండియాపై స్పిన్‌ బౌలింగ్‌తో విరుచుకుపడాలి. గత పర్యటనలో కెవిన్‌ పీటర్సన్‌ ఎలా ఆడాడో అలాంటి ప్రదర్శన చేయాలి. ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు వికెట్లు తీయలేనంత కాలం భారత్‌ను సొంత గడ్డపై ఓడించడం కష్టం. ఆ పర్యటనలో పీటర్సన్‌ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. అతడెంతో దూకుడుగా ఆడాడు. అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అతడి ఆటను ఒక ఉదాహరణలా తీసుకొని ఉత్తమ ప్రదర్శన చేయాలి’ అని మాజీ స్పిన్నర్‌ తమ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు. 

ఇవీ చదవండి..
ఇండియా అంటే ఇది: సెహ్వాగ్‌ 
ఆటగాళ్లకు క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపు

Tags: Sports Newsక్రీడా వార్తలుCricket Newsక్రికెట్‌ వార్తలుTeam Indiaటీమ్‌ఇండియాEnglandఇంగ్లాండ్‌Australiaఆస్ట్రేలియా

రాజకీయం

  • ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్రచారకర్తలు వీళ్లే[01:19]
  • ITIRకు ప్రత్యామ్నాయం చూపించండి: కేటీఆర్‌[01:12]
  • యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ సీఎం[01:04]
  • హంగ్‌ ఏర్పడితే భాజపాతో మమత దోస్తీ[01:27]

జనరల్‌

  • ‘గే’ సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి![01:28]
  • కోటప్పకొండ ప్రభలపై ఆంక్షలు విధించలేదు: ఎస్పీ[01:22]
  • తెలంగాణలో ఏ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారంటే..[01:05]
  • బాలుడు.. లాక్‌డౌన్‌లో రామాయణం రాసేశాడు![01:13]

సినిమా

  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..[01:29]
  • అప్పుడు రామన్న ఇప్పుడు క్రిష్ణయ్య[01:26]
  • ‘సలార్‌’ సంబరం[01:26]
  • విభిన్న కాలాల.. ప్రేమకథ[01:26]
  • ‘దేవినేని’.. బయోపిక్‌ కాదు[01:26]
  • రెండో ‘హిట్‌’కి రంగం సిద్ధం[01:26]
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?[01:26]
  • డేట్‌కి వెళ్లలేదు: పరిణీతి చోప్రా[01:19]
  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..![01:14]
  • తెలుగులోనూ అలరించేందుకు సిద్ధమైన ‘లూకా’[01:06]
  • నిర్మాతలే అసలైన హీరోలు: రామ్‌ పోతినేని[01:07]
  • సాయిపల్లవి.. సారంగ దరియా[01:26]
  • సంక్రాంతి బరిలో పవన్‌[01:26]

క్రైమ్

  • రాళ్లు రువ్వి.. వెంబడించి[01:07]
  • హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు[01:17]

స్పోర్ట్స్

  • అశ్విన్‌.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు  [01:25]
  • భయపడతారని భారత్‌ ముందే ఊహించింది[01:08]
  • మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?[01:18]

బిజినెస్

  • ఒడుదొడుకుల వారమేనా![01:38]
  • రెన్యువల్‌ ప్రీమియంపై80-100 శాతం ప్రోత్సాహకాలు[01:37]
  • 48600 కింద మరింత బలహీనం[01:37]
  • జీలకర్ర కిందకే![01:37]
  • బీమాతోనే మాకు ధీమా[01:37]
  • స్కైట్రాన్‌లో 54.46 శాతానికివాటా పెంపు: ఆర్‌ఐఎల్‌[01:36]
  • సీబీడీటీ ఛైర్మన్‌గా మరో 3 నెలలు మోదీనే[01:36]
  • సంక్షిప్త వార్తలు[01:36]
  • హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో[00:40]
  • కొవిడ్‌-19 టీకాకు 2 డాలర్లేనా?[00:39]
  • ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?[20:00]

జాతీయ-అంతర్జాతీయ

  • నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు![01:27]
  • వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు![01:18]
  • ​​​​​రైతు చట్టాలు కావవి.. డెత్‌ వారెంట్లు: కేజ్రీవాల్‌[01:08]
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌[01:29]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రేపటి సిరులు
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • తెలంగాణలో ఏ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారంటే..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.