శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నిర్భయ దోషుల క్యురేటివ్‌ పిటిషన్లు కొట్టివేత

దిల్లీ: మరణశిక్ష అమలును సవాల్‌ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్‌, ముఖేశ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఛాంబర్‌లో దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం పిటిషన్లను ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. పిటిషన్ల వాదనకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తాజా తీర్పుతో దోషుల ముందున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశం కూడా ముగిసింది. 

కోర్టు తీర్పు పట్ల నిర్భయ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఏడేళ్ల తన న్యాయపోరాటం ఫలించిందన్నారు. కానీ, దోషుల్ని ఉరితీయనున్న రోజే తనకు అత్యంత సంతోషకరమైన దినమని ఆమె వ్యాఖ్యానించారు. 

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన వినయ్‌ శర్మ, ముఖేశ్ సింగ్‌, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తాలను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ దిల్లీ కోర్టు ఇటీవల డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో దోషులు ఇద్దరు వినయ్‌ శర్మ, ముఖేశ్‌ సింగ్‌ గతవారం తమకున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశమైన క్యురేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

 


రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని