శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇన్నేళైనా.. విజయశాంతి కిక్‌పవర్‌ తగ్గలేదు!

వీడియో వైరల్‌

హైదరాబాద్‌: ఓ వైపు కథానాయికగా అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే.. మరోవైపు ‘కర్తవ్యం’, ‘స్ట్రీట్‌ఫైటర్‌’, ‘నాయుడమ్మ’ వంటి పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన నటి విజయశాంతి. ఆమె అనేక యాక్షన్‌ సీన్లలో రౌడీల దుమ్ము దులుపుతూ కనిపించి, ఆకట్టుకున్నారు. దాదాపు గత 12 ఏళ్లుగా సినిమాకు దూరంగా ఉన్న ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇన్నేళ్లవుతున్నా ఆమె కిక్‌లోని పవర్‌ ఏ మాత్రం తగ్గలేదు. 53 ఏళ్ల వయసులోనూ ఆమె కాలిని లిఫ్ట్‌ చేసి, ఫైట్‌ చేస్తున్న వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ షేర్‌ చేసింది. ఈ అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై ఆమె కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై కూడా తనకు నచ్చిన పాత్రలు వస్తే సినిమా చేస్తానని, అది గుర్తుండిపోయేలా ఉండాలని విజయశాంతి తాజా ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మరి దర్శకులు ఆమె కోసం ఎలాంటి పాత్రలు రాస్తోరో చూడాలి.


రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని