శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సెలబ్రిటీల ఇంట భోగి సంబరాలు

శుభాకాంక్షలతో ఫొటోలు షేర్‌ చేసిన స్టార్స్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సెలబ్రిటీలు భోగి పండగను వేడుకగా జరుపుకొంటున్నారు. కుటుంబసభ్యులంతా ఒక్కచోట చేరి సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవి, రామ్‌ చరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్ తేజ్‌, సుస్మిత, నిహారిక తదితరులు భోగి మంటలు వేసుకుని, సంక్రాంతికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చరణ్‌ షేర్‌ చేస్తూ.. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా ‘మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు’ అంటూ సాయిధరమ్‌ తేజ్‌ కొలేజ్‌ను షేర్‌ చేశారు.

చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఫొటోలు, వీడియోలను షేర్‌ చేశారు. అందులో నిహారిక దోశ వేస్తూ కనిపించారు. ‘నేను, నా క్యూటీస్‌.. అందరికీ భోగి శుభాకాంక్షలు’ అని వరుణ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశారు.

అదేవిధంగా అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటల దగ్గర నిలుచుని ఉన్న వీడియోను షేర్‌ చేశారు. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు’ అని కథానాయకుడు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘కొత్త పనులను ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు’ అంటూ మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘హ్యాపీ భోగీ డార్లింగ్స్‌..’ అని మనోజ్‌ విష్‌ చేశారు. అదేవిధంగా మంచు విష్ణు కూడా నెటిజన్లకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. వీడియోలను షేర్‌ చేశారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని