శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

యూపీ డీజీపీ

లఖ్‌నవూ: అయోధ్యపై తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అభ్యంతరకర సందేశాలు, వదంతులు వ్యాప్తి చేయోద్దని ఉత్తరప్రదేశ్‌ డీజీపీ ఓపీ.సింగ్‌ కోరారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. అవసరమైతే జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. వదంతుల నుంచి అప్రమత్తంగా ఉండాలని యూపీ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే తీర్పు నేపథ్యంలో అయోధ్య నగరం సహా రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న భద్రతా ఏర్పాట్లను వివరించారు. ఇప్పటికే ఒక జిల్లాలో 24గంటల అంతర్జాల సేవల్ని నిలిపివేశామని..అవసరమైతే మిగతా ప్రాంతాలకూ దీన్ని విస్తరిస్తామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 42మంది అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 670అనుమానికి సామాజిక మాధ్యమాల ఖాతాలను బ్లాక్‌ చేశామని తెలిపారు. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచామన్నారు. అయోధ్య, లఖ్‌నవూ నగరాల్లో హెలికాప్టర్‌ ద్వారా గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అయోధ్య నగరంలో ఏడీజీ ర్యాంక్‌ అధికారిని నియమించామన్నారు. 

గత నెల రోజులుగా పలు వర్గాలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకున్నామని ఓపీ సింగ్‌ తెలిపారు. మత పెద్దలు, పౌరసమాజ ప్రతినిధులతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని