శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

తాగిన మైకంలో తనయుడిపై తండ్రి దాడి

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: తాగిన మైకంలో కన్న కొడుకుపైనే కత్తి పీటతో తండ్రి దాడి చేసిన ఘటన నర్సాపూర్‌ మండలం గూడెంగడ్డలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంగడ్డకు చెందిన పోచయ్య నిత్యం మద్యం తాగి ఇంట్లో భార్య కృష్ణవేణితో గొడవ పడుతుంటాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి తాగి వచ్చిన పోచయ్య భార్యతో గొడవకు దిగాడు. ఆమెపై కత్తిపీటతో దాడి చేసేందుకు యత్నించగా కుమారుడు నాగరాజు అతడిని అడ్డుకోబోయాడు. దీంతో నాగరాజు తలకు తీవ్రగాయమైంది. వెంటనే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. త్రుటిలో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. రోజూ తాగివచ్చి నానారభస చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణవేణి శుక్రవారం స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని