శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఫిర్యాదు అందిన నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు


సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీకాంత్‌రెడ్డి, పక్కన ఎస్సై సర్దార్‌నాయక్‌

కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని చింతచెట్టుతండాలో అక్టోబర్‌ 29న చోటు చేసుకున్న నేనావత్‌ రమేష్‌(25) మృతి చెందగా మొదట సాధారణ మరణం అనుకొన్నారు. కానీ అనుమానం ఉందని అతని అన్న నరేష్‌ ఈ నెల 5న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సీఐ శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టగా రమేష్‌ను అతని భార్య స్వప్న, ప్రియుడు నాగరాజు కలిసి హత్య చేసినట్లు తెలియగా, విషయాన్ని నిందితులు ఒప్పుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై సర్దార్‌నాయక్‌ వెల్లడించారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతం మండలంలో వెలుగు చూసింది. మండలంలోని చింతచెట్టుతండాకు చెందిన నేనావత్‌ రమేష్‌(25), స్వప్న భార్యభర్తలు. రమేష్‌ హైదరాబాద్‌లో గల ఓ బహుళ అంతస్తుల భవనానికి రమేష్‌ రాత్రి కాపలదారుడిగా విధులు నిర్వహించేవారు. అదే భవనానికి పగలు కాపలాదారుడిగా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బొంత నాగేంద్రబాబు అలియాస్‌ నాగరాజు అనే యువకుడు విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో రమేష్‌ భార్య స్వప్నకి అతనికి పరిచయం ఏర్పడింది. ఈ విషయం రమేష్‌కు తెలిసి భార్యను పలుమార్లు మందలించినా ఆమెలో మార్పు రాలేదు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ప్రియుడు నాగరాజుతో కలిసి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగకు తమ స్వగ్రామమైన చింతచెట్లుతండాకు వచ్చారు. అక్టోబర్‌ 29 రాత్రి స్వప్న భర్తకు అన్నంలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అనంతరం నాగరాజుకు చరవాణిలో సమాచారం ఇవ్వడంతో అదే రాత్రి నాగరాజు చింతచెట్టుతండాకు వచ్చాడు. అతని వెంట తెచ్చుకున్న వైరుతో నిద్రలో ఉన్న రమేష్‌ మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టుకు రిమాండ్‌ చేశారు. ఫిర్యాదు అందిన నాలుగు రోజుల్లోనే చాకచక్యంగా వ్యవహరించి హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకుని కేసు మిస్టరీని ఛేదించిన సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై సర్దార్‌నాయక్‌, పోలీసులు ఏ.శ్రీనివాస్‌, పి.గణేష్‌, వి.హేము, డి.శంకర్‌, తిరుపతిని డీఎస్పీ పి.ఆనంద్‌రెడ్డి ఓ ప్రకటనలో అభినందించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని