శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడు

8 నెలలకే ప్రసవించిన మైనర్‌ బాలిక
నాలుగు రోజుల పసికందు మృతి


నాలుగు రోజుల పసికందు మృతదేహం

జైనథ్‌, న్యూస్‌టుడే(ఆదిలాబాద్): జైనథ్‌ మండలంలోని ఓ యువకుడు మైనర్‌ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గర్భం దాల్చింది. ఈ నెల 5న రిమ్స్‌ ఆసుపత్రిలో 8 నెలలకే ప్రసవించింది. బాబుకి జన్మనిచ్చింది. తనను పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించడంతో నాలుగు రోజుల పసికందుతో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం వచ్చింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన భావునే ప్రకాశ్‌ (22) ఓ మైనర్‌ బాలికను గత కొంతకాలంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడన్నారు. శారీరకంగా లొంగదీసుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ నెల 5న 8 నెలలకే ప్రసవించింది. బాబుకి జన్మనిచ్చిందన్నాడు. 7వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారన్నారు. పుట్టిన బిడ్డ తన సంతానం కాదని ప్రకాశ్‌ పెళ్లికి నిరాకరించడంతో నాలుగు రోజుల పసికందును పట్టుకొని తనకు న్యాయం చేేయాలని పోలీసులను ఆశ్రయించింది. వచ్చే క్రమంలో పసికందు మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని