శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

యువకులను ముగ్గులోకి దింపి.. బ్లాక్‌మెయిలింగ్‌

కేసులు పెట్టి వేధింపులు
3 కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా 27 కేసులు
యువతిని అరెస్టు చేసిన ఆబిడ్స్‌ పోలీసులు

ఆబిడ్స్‌, న్యూస్‌టుడే: ‘మొదట మాయ మాటలతో యువకులను ముగ్గులోకి దించుతుంది. ఆ తర్వాత బాగా సన్నిహితమవుతుంది. కొన్నాళ్లకు.. నాపై అత్యాచారానికి యత్నించావు.. బెదిరింపులకు పాల్పడ్డావంటూ వారిపై అక్రమంగా కేసులు పెడుతూ.. బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది..’ అంటూ ఓ యువతి ఆగడాలను ఆబిడ్స్‌ సీఐ రవికుమార్‌, ఎస్సై బి.రాజు శుక్రవారం ఇక్కడ వివరించారు. ఆబిడ్స్‌ చిరాగ్‌అలీలేన్‌లో ఓ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ రహీం(30) గత నెల 19న అపస్మారక స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. సమాచారం అందుకుని దవాఖానకు వెళ్లి అతని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి విచారణ చేపట్టగా విస్తుగొలిపే అంశాలు పోలీసుల దృష్టికొచ్చాయి. అంబర్‌పేట ఫర్హత్‌నగర్‌కు చెందిన షాదాన్‌ సుల్తానా నిజామియా(27) ఆగడాల చిట్టా చూసి కంగుతిన్నారు.

ఎలా బయటకొచ్చిందంటే...: 2018లో సుల్తానా.. పనిమీద అబ్దుల్‌ రహీం కార్యాలయానికి వెళ్లింది. అతని చరవాణి నంబరు తీసుకొని తరచూ ఫోను చేసేది. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో అత్యాచారం, కిడ్నాప్‌ చేసినట్లు కేసులు పెడతానంటూ బెదిరించింది. భయపడిన అతడు రూ.3 లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశాడు. కొన్నాళ్లకు తిరిగి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రూ.5 లక్షలు ఇస్తావా..? చస్తావా అంటూ బెదిరించడం ప్రారంభించింది. ఇవ్వలేనని చెప్పడంతో.. గత నెల 19న నిద్రమాత్రలు తీసుకొచ్చి ఇవి మింగి ఆత్మహత్య చేసుకో అంటూ బలవంతం చేసింది. అతను ఆ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఆటోలో తీసుకొచ్చి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. బాధితుడి వివరాలు, కాల్‌డేటా ఆధారంగా ఆబిడ్స్‌ పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఎట్టకేలకు ఆమెను శుక్రవారం అరెస్టు చేశారు.
పాత కేసులపై దర్యాప్తు ముమ్మరం: గతంలోనూ మూడు కమిషనరేట్లలో కిడ్నాప్‌, అత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వ్యక్తులపై సుల్తానా 27 కేసులు పెట్టినట్లు విచారణలో తేలింది. ఆయా కేసుల్లో ఎవరెవరిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.. వారి నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేసింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని