శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ప్రైవేటుకు దీటుగా సేవలందించండి

ప్రభుత్వ వైద్యులకు పాలనాధికారి సూచన

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రాణం పోసే వైద్యుడిని.. ప్రజలు దేవుడిగా కొలుస్తారని .. ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని జిల్లా పాలనాధికారి ఎం.హనుమంతరావు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా పేద ప్రజలే వస్తారని.. వారిపై ప్రేమ, ఆప్యాయతలు చూపాలని సూచించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రైవేట్‌ ఆసుపత్రులకు దీటుగా సర్కారీ దవాఖానాల్లో సేవలందించాలని వైద్యులను కోరారు. 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండాలన్నారు.  ఖాళీగా ఉన్న స్టాఫ్‌ నర్సులు.. ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. అవసరమైన చోట డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించాలన్నారు. నిధుల కొరత లేదని ఆసుపత్రుల భవన మరమ్మతులకు, నూతన భవనాలకు నిధులు మంజూరవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలోని కొండాపూర్‌ పీహెచ్‌సీలో ఆదర్శంగా సేవలందిస్తున్నారని... మిగిలిన వారూ వారిని అనుసరించాలని సూచించారు. కొంతమంది వైద్యులు పలు సమస్యలను విన్నవించగా.. కలెక్టర్‌ వెంటనే ఫోన్‌లో సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. సమావేశానికి రాని సంగారెడ్డి, జహీరాబాద్‌ ఆసుపత్రుల వైద్యాధికారులకు తాఖీదులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. శిక్షణలో ఉన్న కలెక్టర్‌ జితీష్‌ వి.పాటిల్‌, జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌, ఉన్నతాధికారి జగన్నాథ్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యులు హాజరయ్యారు.

‘పన్నుల వసూలుపై నిర్లక్ష్యం వద్దు’

సంగారెడ్డి టౌన్‌: పన్నుల వసూలు విషయంలో నిర్లక్ష్యం వద్దని పాలనాధికారి హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పరిపాలన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 29 కేసులకు సంబంధించి రూ.7.98 కోట్లు బకాయిలు వెంటనే వసూలు చేయాలని సూచించారు. సంబంధిత సంస్థలకు నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నిర్ధేశించిన రూ.50 కోట్లు వసూలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం సేకరణకు సంబంధించి 10 సంస్థల నుంచి రూ.8.10 కోట్లు వసూలుచేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.86 లక్షలు వసూలు చేశామని, మిగతావి కోర్టు కేసుల కారణంగా వసూలు చేయలేకపోయామని మార్కెటింగ్‌ శాఖ ఏడీ నరేందర్‌ పాలనాధికారికి వివరించారు. గనులు భూగర్భ శాఖకు రావాల్సిన రూ.8.16 కోట్లు రాబట్టేందుకు ఆర్‌ఆర్‌ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవన నిర్మాణ సంక్షేమ నిధికి 9 సంస్థల నుంచి రావాల్సిన రూ.7.49 కోట్లు వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు. లేఅవుట్‌ అభివృద్ధి ఛార్జీల కింద కొల్లూరులో రూ.10.76 కోట్లు రావాల్సి ఉందని, రెవెన్యూ శాఖ ద్వారా కూడా వసూలు కావాల్సిన మొత్తాలపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. పన్నుల వసూలు లక్ష్యాలు, వసూలుకు సంబంధించి తీసుకున్న చర్యలతో తనకు నివేదిక ఇవ్వాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మనోహర్‌, గనుల శాఖ సహాయ సంచాలకులు మధుకర్‌ పాల్గొన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని