శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రికార్డు వేగం ఆయన సొంతం

విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన సూర్యాపేట వాసి


శ్రీకృష్ణుని వేషధారణలో పెండెం కృష్ణకుమార్‌

కుడకుడరోడ్డు (సూర్యాపేట), న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పెండెం కృష్ణకుమార్‌.. విభిన్న రంగాల్లో ప్రతిభ చూపి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులను సొంతం చేసుకున్నారు. నాటకాలు అంటే చిన్ననాటి నుంచి అతనికి మక్కువ. పాఠశాల స్థాయిలోనే నాటకాలు ప్రదర్శించి పలువురి మన్ననలు పొందారు. ఆ తరువాత సినిమాల్లో నటించాలనే ఆసక్తి కలిగింది. సినిమాల్లో అవకాశలు అంత సులభం కాదని అర్థమవటంతో.. ఎలాగైనా గుర్తింపు పొందాలనే లక్ష్యంతో నాటకాల్లో వివిధ పాత్రలు ఎంచుకోవడం.. చిన్న, చిన్న డైలాగులను సాధన చేయడం ప్రారంభించారు. 2009 లో 11.35 గంటల్లో 65 పాత్రలను ప్రదర్శించి మొదటి రికార్డు సంపాదించారు. 2011లో ఇంగ్లిష్‌ అక్షరాలను 4.65 సెకన్లలో టైప్‌ చేయడం, 2014లో ఒకే నిమిషంలో 16 జతల బూట్లను(షూస్‌) విభజించి బాక్స్‌ల్లో అమర్చడం, 2016లో ఒకే నిమిషంలో 79 మందిని ఆలింగనం చేసుకోవడం ద్వారా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సాధించారు. ఏ పనినైనా వేగంగా చేయడం అలవాటు ఉన్న కృష్ణకుమార్‌.. రికార్డులను సొంతం చేసుకునేందుకు కఠోరంగా శ్రమించారు. వ్యసనాలకు ఆకర్షితులై సమయాన్ని వృథా చేసుకోకుండా.. అంతర్లీనంగా ఉన్న ప్రతిభకు పదును పెట్టాలని యువతకు సూచిస్తున్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని