శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మినుము ఉరుముతోంది..

 ఆకాశాన్నంటుతున్న మినప్పప్పు ధరలు

  ఒక్కసారిగా కిలో రూ.140 నుంచి రూ.150 వరకు చేరిక

 రోజురోజుకూ పెరుగుతుండటంతో తల్లడిల్లుతున్న ప్రజలు

 దిగుమతులు తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు


పొట్టు మినప్పప్పు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ప్రజల నిత్యావసరాల్లో ఒకటైన మినప్పప్పు ధర అనూహ్యంగా ఆకాశాన్నంటింది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కిలో మినప్పప్పు రూ.140 నుంచి రూ.150 వరకు ధర పలుకుతుండడం సామాన్యులకు శరాఘాతంలా పరిణమిస్తోంది. దీని ధర రోజురోజుకూ పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 10 రోజుల వ్యవధిలో ధర అమాంతం పెరుగుతూ వస్తోంది. పొట్టుతో ఉన్న మినప్పప్పును ప్రస్తుతం కిలో రూ.125 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారంలో రూ.20 వరకు వ్యత్యాసం ఉంటోంది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి మినప్పప్పు జిల్లాకు దిగుమతి అవుతోంది. రెండు నెలలుగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో మినప్పప్పు సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. దీని ఫలితంగానే ధర ఒక్కసారిగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌ వ్యాపార కేంద్రాలైన రాజమహేంద్రవరం, పెద్దాపురం, ..మిగతా 7లోరావులపాలెం తదితర చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ కేంద్రాలకు నిత్యం 20 టన్నుల మేర మినప్పప్పు దిగుమతి అయ్యేది, గత కొన్ని రోజులుగా దిగుమతులు మందగించాయి. మినప్పప్పు ధరల పెరుగుదల ప్రభావం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లపై తీవ్రంగా పడుతోంది. దీంతో అల్పాహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశముండటం సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో జిల్లాలో లక్ష ఎకరాల్లో అంతర పంటగా మినుములు పండించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోనసీమలో ఎక్కువగా రబీ తర్వాత మూడో పంటగా మినుములు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కేవలం నాలుగు వేల ఎకరాల్లో మాత్రమే పంట వేయగా, రబీలో 40 వేల ఎకరాల్లో మినుములు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో మినుములు సాగు చేయగా 60 నుంచి 85 రోజుల తద్వారా పంట చేయికొచ్చే అవకాశముంది. జిల్లాలో పంట అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కూడా వరదలతో మినుము పంట దెబ్బతినడం ప్రతిబంధకంగా మారింది. దీంతో మార్కెట్‌లో గిరాకీ పెరిగింది. దీనిని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితిలో మినప్పప్పు ధరల నియంత్రణకు జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

జనవరి నాటికి దిగుబడులు అందుబాటులోకి

జిల్లాలో ఖరీఫ్‌లో ఎక్కువగా మినుములు సాగుచేయరు. ప్రస్తుతం వేసిన పంట జనవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో మినుములు సాగుచేశారు. ఇతర సీజన్లలో మినుములను ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో పంట నష్టం కారణంగా ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. - వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామారావు

సరఫరా లేకపోవడం వల్లే..

జిల్లాలో డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో మినుములు ధర పెరిగింది. రాజమహేంద్రవరం మార్కెట్‌లో రోజుకు రెండు లారీల మినప్పప్పు దిగుమతి అవుతుంది. 10 రోజులుగా గిరాకీ మరింత పెరిగింది. కార్తిక మాసం సందర్భంలో మినప్పప్పు అవసరాలు అధికం కాగా అదే సందర్భంలో దిగుమతి లేక వ్యాపారం ఆశించినంతగా లేదు. - పరుచూరి గోపాలకృష్ణ, హోల్‌సేల్‌ వ్యాపారి

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని