శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ముంగిట్లో... వామన అందాలు!

బృందావనం

బోన్సాయ్‌...  ఒక మొక్కను ఏళ్ల తరబడి మరుగుజ్జుగా, కావాల్సిన ఆకారంలో సహజంగా పెంచే కళ. ఇది చైనాలో పుట్టినా జపనీస్‌ కళగా ప్రాచుర్యం పొందింది. మొక్కను వీలైనంత పొట్టిగా పెంచడమే ఈ కళ ప్రత్యేకత.

సాధారణంగా 30 నుంచి 60 సెంటీమీటర్ల  పొడవులో బోన్సాయ్‌ మొక్కలు పెరుగుతాయి. 25 సెం.మీ. పొడవుండే మొక్కలకు ఆదరణ ఎక్కువ. పదేళ్లు మొదలు... 100 నుంచి 200 ఏళ్లున్న మొక్కలూ అందుబాటులో ఉన్నాయి. వీటి విలువ లక్షల్లో ఉంటుంది. బోన్సాయ్‌ పెంపకానికి వాడే పాత్రలు/కుండీలు అయిదు నుంచి ఏడు సెంటీమీటర్ల ఎత్తుతో, 25-30 సెంటీమీటర్ల వ్యాసార్ధం కలిగి ఉండాలి. రంగుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకాశనీలం, టెర్రకోట, ముదురు ఆకుపచ్చ రంగులున్న కుండీలను ఉపయోగించాలి. ప్రత్యేకించి భారతదేశంలో సపోటా, చింత, అత్తి బోన్సాయ్‌లా పెంచడానికి అత్యంత అనుకూలం. తక్కువ లోతున్న కుండీలు వాడినప్పుడు రోజుకు రెండుసార్లు, మరీ ఎక్కువ లోతుంటే రోజుకొకసారి నీటిని అందించాలి.

మొక్కల ఎంపిక... ఎక్కువ మొత్తంలో కత్తిరింపులను తట్టుకునే మొక్కలను బోన్సాయ్‌కి ఎంచుకోవాలి. కాండం, కొమ్మల కత్తిరింపులోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కాండం వ్యాసార్ధంతో పోలిస్తే చెట్టు పొడవు ఆరు రెట్లు మించకూడదు. చూపరుల దిశగా కాండం ఉండాలి. వేర్లు వలయాకారంలో ఉండేలా చూసుకోవాలి. కాండం మొత్తం మొక్క బరువును తట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పక్కకు వంచకూడదు. బోన్సాయ్‌ తయారీకి వాడే పైన్‌ జాతి మొక్కలను విత్తనాల ద్వారా ప్రవర్థనం చేసుకోవచ్చు.  బోగన్‌విల్లియా, మల్బరీ, దానిమ్మ, ఫైకస్‌ మొక్కలను కత్తిరింపులతో; మల్లెను లేయర్స్‌ ద్వారా; బత్తాయి, సపోటా, మామిడిని అంట్ల ద్వారా ప్రవర్థనం చేసుకోవచ్చు.

కాలం... సాధారణంగా మొక్క మొలకెత్తడానికి ముందు కత్తిరింపులు చేయాలి. జులై-ఆగస్టు... ఫిబ్రవరి-మార్చి బోన్సాయ్‌ తయారీకి, కత్తిరింపులకు అనువైన కాలం. ఎంచుకున్న మొక్కకు 30 శాతం వేర్లతోపాటు పొడుగ్గా ఉన్న వేర్లనూ తొలగించాలి. ఎక్కువగా ఉన్న కొమ్మలను తీసేయాలి. ఈ సమయంలో సరైన మోతాదులో పోషకాలను, నీటిని అందించాలి. వేడి ఎక్కువగా, చలి తీవ్రంగా ఉన్న మాసాల్లో కుండీల్లో మొక్కల్ని పెట్టకూడదు. ప్రతి రెండు మూడేళ్లకోసారి మొక్క ఎదుగుదలను బట్టి కుండీలను మార్చాలి. ఒకటి రెండుసార్లు అధికంగా ఉన్న ఆకులను తీసేయాలి. అనుకున్న ఆకృతి కోసం కత్తిరింపులు తప్పదు. రాగితీగ, పాలిథీÇన్‌ టేపును ఉపయోగించి, సరైన ఆకృతి వచ్చేవరకు కట్టాలి. ఆ తరువాత తీగలను తీసేయాలి. రెండొంతుల ఒండ్రుమట్టి, ఒక వంతు ఆకు వ్యర్థాలు, కొంత మొత్తం ఇసుకతో కూడిన మట్టి మిశ్రమాన్ని ఈ మొక్కలకు ఎంచుకోవాలి. ఒకట్రెండు రాళ్లను సైతం కుండీల్లో ఉంచితే సహజ ఆకృతి వస్తుంది. 


కొమ్మలకు శిక్షణ ఇలా...

* ఎట్టి పరిస్థితుల్లో కొమ్మల సైజు... కాండం పరిమాణాన్ని మించకూడదు.
* ప్రతి కొమ్మపై వచ్చే రెండోతరం కొమ్మలు, ఒకదాని తరువాత మరొకటి ఉండాలి.
* తక్కువ కణుపులతో, ఆకర్షణీయమైన వేర్లిచ్చే మొక్కలు వాడాలి.
*  బోన్సాయ్‌ ఎక్కువకాలం ఉండాలంటే వేర్లను క్రమంగా కత్తిరించడంతోపాటు... మూడింతల వేర్లను సహజంగా ఉండేలా చూడాలి.


- సూరం సింధూజ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,
శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం,
హైదరాబాద్‌

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని