శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

చలికి... వెచ్చటి పరదాలు!

వాతావరణాన్ని బట్టి... దుస్తుల్ని మారుస్తుంటాం. ఇదే సూత్రం పరదాలకూ వర్తిస్తుంది. ఎండాకాలంలో లేతరంగులు ఎంత సౌకర్యాన్నిస్తాయో... చలికాలంలో ముదురురంగు పరదాలు ఇంటిని వెచ్చగా ఉంచుతాయి. వాటి విషయంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...

* నీలం రంగు పరదాలు ఇంటికి  ప్రత్యేక అందాన్ని తేవడంతోపాటు వెచ్చదనపు అనుభూతిని అందిస్తాయి. కావాలనుకుంటే ఇతర రంగులతో కలిపి వాడుకోవచ్చు లేదా ఇందులోనే ప్రింట్లున్నవి ఎంపిక చేసుకోవచ్చు. ఈ రంగు పరదాలు ముందుగదికి చక్కని ఎంపిక.

* ఒకవేళ ఇంటి అలంకరణలో భాగంగా... మెరిసే పరదాలు వేలాడదీయాలనుకుంటున్నారా... దాంతోపాటు కాస్త మందంగా ఉన్న పరదానీ జతచేయండి. ఈ కాలంలో కాంతిమంతమైన ముదురు పసుపు రంగు సైతం సరైన ఎంపిక. దీన్ని పూలు, ఇతర ప్రింట్లలోనూ ఎంచుకోవచ్చు.

* ఈ కాలంలో ఎండ మరీ ఎక్కువగా ఉండదు. ఇలాంటప్పుడు ఇల్లంతా వెలుగుతోపాటు వెచ్చగా ఉండాలంటే ఎరుపు రంగు పరదాలు ఎంచుకోవాల్సిందే. సాధారణ రకం కాకుండా... వెల్వెట్‌ వస్త్రంలో ఎంచుకుంటే చలిగాలులు లోపలికి రావు. గదికి కొత్త కాంతీ వస్తుంది.

* ఈ పరదాలను ప్రతి పదిహేను రోజులకోసారి మారుస్తుంటే... అలర్జీల సమస్యా ఎదురుకాదు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని