శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రోజంతా తింటున్నారా

శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉండాలంటే.... కొన్ని పదార్థాలు రోజూ తీసుకోవాలి. అదీ ఒకటి చొప్పున ఏదో ఒక సమయంలో తీసుకుంటే చాలు. పోషకాలు అందుతాయి. రోజంతా చురుగ్గానూ ఉంటారు.

క్యారెట్‌: ఇందులో బీటా కెరొటిన్‌, పీచు, కె విటమిన్‌, పొటాషియం... వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తి పెంచడమే కాదు, చర్మ ఆరోగ్యాన్నీ కాపాడతాయి.

గుడ్డు: మాంసకృత్తులు, ఎ, బి6, బి12, డి, కె విటమిన్లతోపాటు జింక్‌, ఇనుము, రాగి వంటి పోషకాలను అందిస్తుందిది. దీన్ని రోజుకొకటి తీసుకుంటే... సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమైనట్లే.

చిలగడ దుంప: కొవ్వు తక్కువగా, పీచు, మాంసకృత్తులు, ఎ, బి6, సి విటమిన్లు ఇందులో ఉంటాయి. మాంగనీస్‌, పొటాషియం, కాపర్‌, నియాసిన్‌ ఉండే చిలగడ దుంపను రోజుకొకటి ఉడికించుకుని తింటే ప్రాణాంతకమైన వ్యాధులబారిన పడకుండా చూసుకోవచ్చు.

యాపిల్‌: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తంలో చక్కెరస్థాయులు పెరగకుండా చేస్తుందీ పండు. అధికబరువునూ తగ్గిస్తుంది. ఇందులోని ఇతర పోషకాలు   ఎర్ర రక్తకణాల తయారీలో ప్రధానపాత్ర వహిస్తాయి. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందీ పండు.

అరటిపండు: పీచు పదార్థం, పొటాషియం అధికంగా ఉండే ఈ పండును రోజూ ఒకటి చొప్పున తింటే జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఉబ్బసం, క్యాన్సర్‌, అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది అరటి.

డార్క్‌ చాక్లెట్‌: ఇందులో ఖనిజలవణాలతోపాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇనుము, మెగ్నీషియం, రాగి, మాంగనీస్‌ ఉండటంతో ప్రతిరోజూ చిన్న ముక్క తీసుకుంటే చాలు. శరీరం చురుగ్గా ఉండటంతోపాటు... అనారోగ్యాలూ దరిచేరవు.

కీరదోస: అతి తక్కువ కెలొరీలు, సి, కెల విటమిన్లతోపాటు ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే కీరదోసను రోజుకోసారి తింటే చాలు. ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, నీటి శాతం, పీచు అధికంగా ఉంటుంది. అధిక బరువునీ తగ్గించుకోవచ్చు. ఆనారోగ్యాలు దరిచేరవు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని